ఆంధ్రప్రదేశ్ లో చీమ చిటుక్కు మన్నా, అదేదో బ్రహ్మాండం బద్దలు అయిపోయినట్టు మీడియా హడావడి చేస్తూ ఉండేది. తెలంగాణాలో, ఘోర ప్రమాదాలు జరిగినా, 62 మంది చనిపోయినా, రోడ్ల పై వరుస పెట్టి పరువు హత్యలు జరిగినా, కనీసం ప్రభుత్వాన్ని ఎదురించేలేని పిరికి వాళ్ళులా మీడియా తయారయ్యారు. కేసీఆర్ మీద ఒక్కటంటే ఒక్క నెగటివ్ వార్తా రాసే దమ్ము లేదు. అయితే, తెలంగాణా ప్రజల్లో మాత్రం, కేసీఆర్ పై పూర్తి వ్యతిరేకత ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రజలు, తెరాస నాయకులకి ఎలా చుక్కలు చూపిస్తున్నారో చూసాం. దాదపుగా కేసీఆర్ ఓడిపోతున్నాడు అనే వాతావరణం వచ్చేసింది. ఇది రోజు రొజుకి బలపడుతూ ఉండటంతో, ఇక మీడియా కూడా ఓపెన్ అయినట్టు ఉంది. అందుకే మొదటి సారి కేసీఆర్ పై వచ్చిన నెగటివ్ వార్తాని పెద్ద ఎత్తున ఈ రోజు ప్రచారం చేసాయి.
తెలంగాణ అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో మహాకూటమి ఘనవిజయం సాధించే అవకాశం ఉందని.. ఏబీపీ న్యూస్, రిపబ్లిక్ టీవీ కోసం సీ-వోటర్ (సెంటర్ ఫర్ ఓటింగ్ ఒపీనియన్స్ అండ్ ట్రెండ్స్) చేసిన సర్వేలో తేలింది. ఇదే విషయం ఈ రోజు అన్ని పత్రికలు, చానల్స్ ప్రధానంగా వెయ్యటంతో, మన మీడియాకి ఇంత ధైర్యం ఎక్కడ నుంచి వచ్చిందని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్-టీడీపీ కూటమికి 64 సీట్లతో సాధారణ మెజారిటీ వస్తుందని.. టీఆర్‌ఎస్‌కు 42 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక తేల్చింది. అలాగే, బీజేపీకి 4 సీట్లు.. ఇతరులకు 9 సీట్లు వచ్చే చాన్స్ ఉంది. ఓట్ల శాతం చూస్తే, మహాకూటమికి 33.9 శాతం ఓట్లు.. టీఆర్‌ఎస్‌కు 29.4 శాతం ఓట్లు వస్తాయని సర్వే నివేదిక తేల్చింది.
\
ఇప్పటివరకూ తెలంగాణపై వచ్చిన అన్ని సర్వేలూ టీఆర్‌ఎస్సే గెలుస్తుందని చెబుతుండగా.. మహాకూటమి గెలుస్తుందని తేల్చిన మొదటి సర్వే ఇదే! ఇక.. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయానికి వస్తే మాత్రం సర్వేలో పాల్గొన్నవారిలో అత్యధికులు కేసీఆర్‌వైపే మొగ్గు చూపారు. మొత్తం 42.9 శాతం మంది కేసీఆరే సీఎం కావాలని కోరుకోగా.. 27 శాతం మంది వేరెవరైనా అయితే బాగుంటుంది/ఇంకా తేల్చుకోలేదు అని చెప్పారు. 22.6 శాతం మంది జానారెడ్డిని సీఎం అభ్యర్థిగా బలపరచగా.. 7.2% మంది రేవంత్ రెడ్డి సీఎం అయితే బాగుంటుందన్నారు. తెలంగాణలో పరిస్థితిని ఒక్కమాటలో చెప్పాలంటే.. కేసీఆర్‌కు వ్యక్తిగతంగా ప్రజాదరణ ఉన్నా, ఎన్నికల లెక్కలు మాత్రం మహాకూటమికి అనుకూలంగా ఉన్నట్టు తేల్చిచెప్పింది.