హైకోర్ట్ విభజించాలి అంటూ, నిన్న తెరాస ఎంపీలు పార్లమెంట్ లో చేసిన హడావిడి చూసాం... ఇక్కడ కూడా చంద్రబాబుని తిడుతూ పబ్బం గడుపుకున్నారు... ఎందుకంటే కేసీఆర్ రాజకీయంగా నిలదొక్కుకోవాలి అంటే, చంద్రబాబుని తిట్టల్సిందే.... ఆయన పరిపాలనలో పొడిచింది ఏమి లేదు కాబట్టి, చంద్రబాబు మీద పడి ఏడుస్తా ఉంటాడు.... నిన్న జరిగింది కూడా అదే. నిజానికి తెరాస ఎంపీలు జూలై 2016లో హై కోర్ట్ విభజన పై ఒకసారి ఆందోళన చేశారు. అంతే మళ్ళీ సైలెంట్ అయిపోయారు.. ఏమైందో ఏంటో, నిన్న సడన్ గా హైకోర్టు కోసం తెరాస ఎంపీల పార్లమెంటులో నిరసన తెలిపారు... అసలు విషయం ఏంటి అంటే, చంద్రబాబు లేఖ....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి వ్రాసిన లేఖ గురించి తెలిసి... అంతకుముందే ప్రత్యేక హైకోర్టు కోసం పార్లమెంటులో పోరాడింది తెరాసానే అని రాజకీయ లబ్ది పొందడం కోసం ఈ హడావిడి చేసారు. అచ్చం ప్రత్యేక తెలంగాణ కోసం సకల జనుల పోరాటం వల్ల కాదు తనవల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది అని తెలంగాణా ప్రజలని ఎలా నమ్మించాడో అలా.. ప్రత్యేక హైకోర్టు ఏర్పటులో కేసీఆర్ చేసేదేమి చేయలేక తన పదవీకాలం ముగింపు దశలో అదీ చంద్రబాబు సంసిద్దత వ్యక్తం చేస్తూ పంపిన లేఖను నమ్మి, పార్లమెంటులో తెరాస ఏంపీ ల రాజకీయ లబ్దికోసం చేసిన జిమ్మిక్కు హడావిడే తప్ప ఈయన పొడించింది ఏమి లేదు...
ఈ హై కోర్ట్ విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎప్పటి నుంచో కసరత్తు చేస్తుంది. చేసింది అంతా చంద్రబాబు అయితే, ఇక్కడ కెసిఆర్ చివరి నిమిషంలో వచ్చి డ్రామాలు ఆడుతున్నాడు. రాజధాని అమరావతిలో మొదటి దశ నిర్మాణాల్లో హైకోర్టు భవనం కూడా ఉంది. దానికి సంబంధించిన నమూనాలను కూడా ఇటీవలే ముఖ్యమంత్రి ఓకే చేశారు. అయితే, ఆ భవనం పూర్తయ్యే వరకూ హైకోర్టు ఏర్పాటు జరగదా అనే అనుమానం అవసరం లేదనే సంకేతాలను కూడా ఏపీ సర్కారు ఇస్తోంది. విజయవాడలో ఓ తాత్కాలిక భవనం కోసం అన్వేషిస్తున్నారనీ, ప్రధాన న్యాయమూర్తిని తీసుకెళ్లి, వారికి అనుకూలమైన భవనాన్ని చూపించి.. కోర్టును ఏర్పాటు చేయాలనే ఉద్దేశంలో, ఇప్పటికే ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి చంద్రబాబు లేఖ రాశారు. ఇక్కడ చంద్రబాబు మీద పడి ఏడవటం ఎందుకు అంటే, కెసిఆర్ తన పరిపాలన గురించి చెప్పుకోవటం కంటే, చంద్రబాబుని తిట్టి విద్వేషాలు రెచ్చగొడితేనే తనకి భవిష్యత్తు అని భావించి ఇలా ఏడుస్తున్నాడు...