అసెంబ్లీ రద్దు చేసిన కెసిఆర్ కి అన్ని వైపుల నుంచి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. మీడియా కవరింగ్ తప్పితే, పరిస్థితి దారుణంగా ఉంది. అయితే ఇప్పుడు ఎన్నికల కమిషన్ రూపంలో, మరో ఇబ్బంది వచ్చింది. అసెంబ్లీ రద్దయిన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని ఈసీ పేర్కొంది. విధానపర నిర్ణయాలు తీసుకోవద్దని, ఎన్నికల సమయంలో వర్తించే నియమాలన్నీ పాటించాలని ఈసీ ఆదేశించింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి, అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు గురువారం లేఖ రాసింది. దీంతో కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకోవటానికి వీలు లేదు. ఇది కెసిఆర్ కు పెద్ద ఎదురు దెబ్బ.

kcr 27092018 2

ప్రజలని మభ్య పెడుతూ, కొన్ని నిర్ణయాలు చేద్దాం అనుకున్న కెసిఆర్ కి, ఇది పెద్ద ఎదురు దెబ్బ. అసెంబ్లీ రద్దయిన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కొత్త అసెంబ్లీ ఏర్పడే వరకు ఇది వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం సహా అసెంబ్లీ రద్దయిన రాష్ట్రాల్లో ఎటువంటి ప్రజాకర్ష పథకాల పై ప్రకటన చేయరాదని కూడా ఈసీ స్పష్టం చేసింది. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. లేఖలో ఈసీ చాలా స్పష్టంగా చెప్పింది. ఎస్‌ఆర్‌ బొంబాయి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియాకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు చెప్పిన నియమ నిబంధనలన్నీ వర్తిస్తాయని వెల్లడించింది.

kcr 27092018 3

ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఉన్నచోట ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుంది గనక, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఆపద్ధర్మ ప్రభుత్వం కానీ ఓటర్లను ఆకర్షించే విధంగా కొత్త విధివిధానాలు ప్రకటించడం గానీ, విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడమైనా ఎన్నికల నియమావళి పరిధిలోకి వస్తాయని తెలిపింది. తెలంగాణలో అసెంబ్లీ రద్దయిన తర్వాత కూడా మెట్రో రైలుకు సంబంధించి ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మంత్రి హోదాలో ఉన్నట్లుగా ప్రవర్తించారని, కేసీఆర్ వ్యవహార శైలిగానీ, కొన్ని కార్యక్రమాలో మంత్రులు పాల్గొనడం.. తదితర వాటిపై ఈసీకి పిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read