నెల్లూరులో అతనో ఆటో డ్రైవర్. పేరు పి వెంకటేశ్వర్లు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల్లో కుటుంబమంతా లబ్ధి పొంది ఉన్నాడు. అయితే, ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన మనసు నొచ్చుకున్నాయి. అందరిలా ఆయన ఊరికే ఉండలేదు. తను నడుపుతున్న ఆటో వెనుక ‘‘ఏపీలో ఏం పీకుతావ్ కేసీఆర్’’ అంటూ మూడు నెలల క్రితం ప్లెక్సీ అతికించాడు. ‘‘నాన్న చనిపోతే రూ.50వేలు తక్షణ సాయం అందింది. అమ్మ విజయకు నెలా నెలా రూ.2వేల చొప్పున వృద్ధాప్య పింఛను, అక్క భర్త చనిపోతే ఆమెకూ రూ.50వేలు ఇచ్చారు. ఇప్పుడు డబుల్ బెడ్‌రూం వచ్చింది. అన్న మురిళీకి ఇల్లొచ్చింది. ఇంత చేస్తున్న చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేక ఈ ప్లెక్సీ పెట్టా’’నంటున్నాడు
ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఇలా ఉంది. సామాన్య ఆటో డ్రైవర్ కూడా, ఏపి అంటే ప్రాణం ఇస్తున్నాడు. ఏపిని ద్వేషించే వారికి ఆంధ్రా వాడి ఆత్మ గౌరవం దెబ్బ చూపిస్తున్నాడు. ఇలాంటి ఆంధ్రా ద్వేషితో, మన ఖర్మకు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి, చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతాడు. ఆంధ్రా ప్రజలని, ఆంధ్ర రాష్ట్రాన్ని అడుగడుగునా అవమానాలు చేస్తుంటే, ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా, అనుకుండా, ఆ మాటలు సమర్ధిస్తున్నా అన్నట్టు, అతనితోనే కలుస్తూ, ఏపిలోకి వచ్చి రాజకీయం చేస్తున్నా అని బహిరంగంగా ప్రకటిస్తాడు. ప్రతివ విషయంలో వాళ్ళు ఆంధ్రా ప్రజలను అవమానిస్తూ, మా తెలంగాణా గొప్పది అంటూ వాళ్ళ రాష్ట్రాన్ని పొగుడుతూ, మన రాష్ట్రాన్ని హేళన చేస్తుంటే, వారికే భజన చేస్తాడు. రాజకీయాలు వేరు, రాష్ట్రం వేరు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఆంధ్రులకు ఆత్మాభిమానం ఉండి, ఆత్మ గౌరవం ఉంటుంది. అవి, వారిని అవమానించిన వారి కాళ్ళ దగ్గరే తాకట్టు పెడితే, ఆంధ్రుడు చూస్తూ ఊరుకోడు జగన్.. రాజకీయాలు పక్కన పెట్టి మా ఆంధ్రుల ఆత్మగౌరవానికి కొంచెం అయిన విలువ ఇవ్వు.
అలాగే కేసీఆర్ ఆంధ్రా వాడి జోలికి రాకు.. నువ్వు ఏపి వచ్చి, ఎంతగా చంద్రబాబును తిడితే నాలుగు ఓట్లు ఎక్కువే పడతాయే తప్ప ఒక్క ఓటు కూడా తగ్గదు అని ఏపి ప్రజలు అంటున్నారు. మా ఏపి ప్రజలు గొర్రెల మంద కాదు, నీ లాంటి సొల్లు వాగుడు వినాటానికి. నీ వల్ల సర్వం కోల్పోయి, రోడ్డున పడ్డ రాష్ట్రం మాది. నీలాంటి వాళ్ళని వెనకేసుకుని వచ్చే కుల పిచ్చ వెధవలు, మా రాష్ట్రంలో ఉన్నారు, వాళ్లకి సరైన బుద్ధి చెప్తాం. హాయగా ఎన్నికలు గెలిచావ్, ఫార్మ్ హౌస్ లో పార్టీ చేసుకో. మా రాష్ట్రం జోలికి, మా ముఖ్యమంత్రి జోలికి వస్తే, ఏమి చెయ్యాలో మా ప్రజలకి బాగా తెలుసు. ఇప్పటికే మోడీ, జగన్, కలిసి ఎన్నో కుట్రలు చేస్తున్నారో, నువ్వు వస్తే మాకు పెద్దగా ఊడేది ఏమి లేదు, మరింత గట్టిగా, కసిగా పని చేసి, మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. మేము ఆంధ్రులం, గొర్రెల మందలం కాదు. నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే, మా ఏపి ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి, మా రాష్ట్రాన్ని కాపాడుకుని, చంద్రబాబుని మళ్ళీ గెలిపించుకుంటాం.