మోడీ, అమిత్ షా ప్లాన్ ప్రకారం, కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భగంగా, చంద్రబాబు దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసే కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్లాన్ వేసారు. దీని కోసం కేసీఆర్ రంగంలోకి దిగి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నవీన్ పట్నాయక్ ను కలిసి హడావిడ్ చేసారు. వాళ్ళని చంద్రబాబు వైపు వెళ్ళకుండా ప్లాన్ వేసారు. అయతే మొన్నటి వరకు ప్రతిపక్షాలు అన్నీ, ఎన్నికల తరువాతే అలయన్స్ పెట్టుకునే వ్యూహం పన్నాయి. దీంతో కేసీఆర్ చెప్పే ఫెడరల్ ఫ్రంట్ డ్రామా సజీవంగా ఉన్నట్టు అయ్యింది. అయితే నిన్న ఢిల్లీలో సమావేశం అయిన ప్రతిపక్ష పార్టీలు, కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమిని ఓడించేందుకు ఎన్నికలకు ముందే ప్రజాకూటమిగా ఏర్పడాలనే నిర్ణయానికి వచ్చాయి.
కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ) ద్వారా సార్వత్రిక ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించాయి. సీఎంపీ ముసాయిదా రూపకల్పన బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని బృందానికి అప్పగించాయి. తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు ఈ నెల 26, 27, 28 తేదీల్లో ఏదో ఒకరోజు సమావేశం జరపాలనే నిర్ణయానికొచ్చాయి. బుధవారం దిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ నివాసంలో విపక్ష నేతలు సుదీర్ఘంగా సమావేశం జరిపి ఎన్నికల వ్యూహరచనపై చర్చించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, దిల్లీ సీఎం కేజ్రీవాల్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్‌అబ్దుల్లా పాల్గొన్న ఈ సమావేశం అనుకోకుండా జరిగింది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మెజారిటీ స్థానాలు ఉన్న కూటమికే రాష్ట్రపతి ఆహ్వానం పంపాలని సర్కారియా కమిషన్, సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఎన్నికల ముందే ఒక మహాకూటమి ఏర్పాటు చేయాలని చంద్రబాబు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలోనే చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. అనంతరం రాహుల్‌గాంధీ మాట్లాడుతూ... నిర్మాణాత్మక చర్చలు జరిగాయని చెప్పారు. అన్ని పార్టీల అభిప్రాయాన్ని కనీస ఉమ్మడి కార్యక్రమంలో చేరుస్తామన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, రాజకీయ ఒత్తిళ్లకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఏ రకంగా ఎదుర్కోవాలో తాము ఎదుర్కొంటామని చెప్పారు. మమతా బెనర్జీ మాట్లాడుతూ, రాహుల్‌గాంధీ కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదా రూపొందించి అందరికి అందిస్తారని, ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో, ఇక కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కి నిన్నటితో సమాధి పడినట్టు అయ్యింది. దేశంలో ఉన్న అన్ని విపక్షాలు ఎన్నికల ముందే ఏకం అయ్యాయి. ఒక్క కేసీఆర్, ఒవైసీ, జగన్ మినహా, అన్ని విపక్ష పార్టీలు ఏకం అయ్యాయి. నవీన్ పట్నాయక్ ఎలాగూ ముందు నుంచి ఏ కూటమిలోను ఉండరు కాబట్టి, ఆయనను పక్కన పెడితే, దేశంలోని విపక్షాలు అన్నీ ఏకం అయ్యాయి.