5 ఏళ్ళు పాలించమంటే, 4 ఏళ్ళకే చాప చుట్టేసి, ఎందుకు చుట్టేసారో ప్రజలకు సరైన వివరణ ఇవ్వకుండా, ముందస్తు ఎన్నికలు అన్నాడు కేసీఆర్. సరే, ఈ 4 ఏళ్ళలో తాను ఏమి చేసాడో చెప్తున్నాడా అంటే, అదేమీ లేకుండా, కేవలం చంద్రబాబు మీద పడి ఏడుస్తున్నాడు. అదేంటి చంద్రబాబు 0.01% ఓట్లు ఉన్నాడు అని కేసీఆర్ అన్నాడు కదా, మరి చంద్రబాబు మీద పడి ఏడవటం ఎందుకు అంటే, ఒక్కడి దగ్గర సమాధానం లేదు. కేసీఆర్ పరిపాలనలో చెప్పుకోవటానికి ఏమి లేదు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ని అంటే పెద్దగా ఉపయోగం ఉండదు. అదే చంద్రబాబుని బూచిగా చూపిస్తే, ఓట్లు రాలతాయని కేసీఆర్ దిక్కుమాలని ఆలోచన. అందుకే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐతోపాటు ఏపీ సీఎం చంద్రబాబును ప్రధానంగా టార్గెట్‌ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

kcr 09112018

చంద్రబాబుపై తాము చేస్తున్న రాజకీయ విమర్శలు తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లను ప్రభావితం చేసే అంశాన్ని బేరీజు వేసుకున్న తర్వాత కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస నేతలు చెప్తున్నారు. ఇటీవల కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు తదితరులు కాంగ్రెస్‌, టీడీపీపైనే కాకుండా, చంద్రబాబుపైనా తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై రాజకీయ ప్రత్యర్థుల నుంచి ప్రతి విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో.. చంద్రబాబును విమర్శిస్తే.. తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లు టీఆర్‌ఎ్‌సకి దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. దీని పై పార్టీ కేసిఆర్ క్షేత్రస్థాయిలో సర్వేలు చేయించడంతో పాటు, జగన్, పవన్ నుంచి కూడా హామీ పొందినట్టు తెలుస్తుంది.

kcr 09112018

రాష్ట్రంలో సీమాంధ్ర ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల నుంచి కేసీఆర్‌ స్వయంగా ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నారు. స్థానికంగా పార్టీ అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలతో మాట్లాడి వారి మనోగతాన్ని తెలుసుకున్నారు. అంతే కాదు, జగన్, పవన్ కూడా పూర్తి సహకారం అందిస్తారని చెప్పారని, ఇవన్నీ చుసిన తరువాత , చంద్రబాబును విమర్శిస్తే సీమాంధ్ర ఓటర్లు గంపగుత్తగా టీఆర్‌ఎ్‌సకి దూరం కాబోరనే అభిప్రాయానికి టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం వచ్చిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే, గత రెండు, మూడు రోజులుగా చంద్ర బాబుపై విరుచుకుపడటాన్ని టీఆర్‌ఎస్‌ నేతలు తిరిగి కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ విమర్శల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. చూద్దాం, కేసీఆర్ సరైన నిర్ణయం తీసుకున్నాడో, లేక తెలంగాణా ప్రజలు సరైన నిర్ణయం తీసుకొంటారో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read