జగన్, కెసిఆర్ ఎంత రహస్య స్నేహితులు అనేది బహిరంగ రహస్యమే.. కెసిఆర్ కి ఇక్కడ పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి లేకపోయినా, చంద్రబాబుని దెబ్బ కొట్టి, ఆంధ్రప్రదేశ్ లో నాయకత్వం సరిగ్గా లేదు అని చూపించి, పెట్టుబడులు రాకుండా చూడటానికి, జగన్ తో కలిసి అనేక ప్లాన్లు వేసారు. ఇప్పటికే మిషన్ కాకతీయా కాంట్రాక్టు జగన్ పార్టీ నేత, పెద్ది రెడ్డికి ఇచ్చి, అక్కడ వచ్చిన కమిషన్ డబ్బులతో, నంద్యాలలో డంప్ చేశారు అనే ప్రచారం కూడా జరిగింది. ఎలా అయినా తెలుగుదేశం ఓడిపోవాలని, కెసిఆర్ తన వంతు ప్రయత్నం చేశారు. అది అప్పటి నంద్యాల ఎలక్షన్స్ అప్పటి టాక్... కెసిఆర్, జగన్ కు ఎంతలా సహాయ పడుతున్నారు అనేది ఇప్పుడు బహిరంగ రహస్యం అయిపొయింది...
హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో బిల్డర్లు అందరూ కలిసి మేడిపల్లి ఎస్వీ ఎం గ్రాండ్ హెటల్లో సమావేశం అయ్యారు.. ఆ మీటింగ్ కు జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు... ఆ సమావేశంలో అనేక ఆశక్తికర విషయాలు బహిరంగంగానే బయటపడింది... . హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టలో వాడిన సిమెంట్ మొత్తం, భారతీ సిమెంట్స్ నుంచి వచ్చిందే.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్రూంల నిర్మాణాలకు కూడా భారతి సిమెంట్స్ నుంచి వచ్చిన సిమెంట్ మాత్రమే వాడుతున్నారు అంటూ, అక్కడకు వచ్చిన భారతీ సిమెంట్స్ ప్రతినిధి చెప్పుకొచ్చారు... తెలంగాణా ప్రభుత్వం ఏ ప్రాజెక్ట్ చేపట్టినా భారతి సిమెంట్స్ మాత్రమే వాడుతారు అంటూ అక్కడ బిల్డర్స్ కి చెప్పుకొచ్చారు...
ఎన్నో ప్రముఖ సిమెంట్ కంపెనీలు ఉండగా, తెలంగాణాలో జరుగుతున్న ప్రతి ప్రాజెక్ట్ లో భారతీ సిమెంట్స్ మాత్రమే వాడాలని తెలంగాణా ప్రభుత్వం చెప్పటం చూస్తుంటే, జగన్ కు ఎంత సహాయం చేస్తున్నారో అర్ధమవుతుంది... ఇద్దరూ కలిసి, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అనేక సమస్యలు సృష్టించారు... చివరకి రాయలసీమకు నీళ్ళు ఇస్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళు తోడేస్తుంది అంటూ, తెలంగాణా ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ సాక్షిలో కధనాలు రాస్తూ ఉన్నారు... మొన్నటి దాకా రహస్య స్నేహితులుగా ఉన్న జగన్ - కెసిఆర్ బంధం, భారతీ సిమెంట్స్ ప్రతినిధి ఇలా బయట పెట్టారు...