తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు, ప్రపంచ తెలుగు మహాసభల పేరు మీద మీరు చేస్తున్న పని మంచిదే... తెలుగు మహాసభలు అని చెప్పగానే, సరిహద్దులకు అతీతంగా తెలుగువారందరూ పాల్గొనేలా చేసి రాష్ట్రాలుగా విడిపోయినా.. జాతిగా, సాంస్కృతికంగా కలిసే ఉన్నాం అన్న స్పృహను కల్పిస్తారు అని అందరం భావించాం... సరే, మీ రాజకీయ ప్రయోజనం కోసం మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఎప్పుడూ చిన్న చూపు చూస్తేనే మీకు మనుగడ అని అందరికీ తెలిసిందే... కాని, మీరు ప్రపంచ తెలుగు మహాసభలలో, మీరు గతంలో చేసిన ఈ మూడు పనులకు క్షమాపణ చెప్పి, ఏమైనా చేసుకోండి... అప్పుడు మీకు గౌరవం పెరుగుతుంది...
మీరు తెలంగాణా ఉద్యమాలు చేస్తున్న రోజుల్లో, మీరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర అక్షపనీయం.. ఒక్కసారి ఈ వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకుని, మీకు ఇవాళ తెలుగు మహాసభలు నిర్వహించే అర్హత ఉందేమో ఆలోచించండి... తెలుగు తల్లి కాదు, దెయ్యం అని అన్నారు గుర్తుందా? తెలుగు తల్లి ఎవరికి తల్లి అన్నారు, గుర్తుందా? మా భాష వేరు అన్నారు గుర్తుందా? అసలు తెలుగు తల్లి మాకు తల్లే కాదు.. తెలంగాణా తల్లి అంటూ వేరే విగ్రహం తయారు చేసుకున్నారు గుర్తుందా ? మరి ఇప్పుడు ఈ తెలుగు భాష ఎవరిదీ? మరి మీరు ఆ తెలుగు తల్లికి క్షమాపణ చెప్పకుండా, ఎలా ఈ మహాసభలునిర్వహిస్తారు ?
రెండవది... "మా తెలుగు తల్లి మల్లెపూవు దండ" గీతం ఎవరి కోసం ? ఆ పాట మేము ఎందుకు పాడాలి ? ఆ గేయాన్ని ఎవరూ పాడవద్దు... స్కూల్ పుస్తకాల్లో ఈ గేయం ఉన్న పేజీలు చింపివెయ్యాలి అన్నారు గుర్తుందా ? మరి ఇప్పుడు ఈ తెలుగు భాష ఎవరిది ? మూడవది... తెలుగు భాషకు 56 అక్షరాలు ఉన్నాయి... మా తెలంగాణా భాషకు 31 అక్షరాలు అవసరం లేదు, మాకు 25 అక్షరాలు చాలు అని, తెలుగు భాషని అవమానించలేదా ? మరి ఇప్పుడు ఈ తెలుగు భాష ఎవరిదీ ? మీరు గతంలో చేసిన ఈ మూడు పనులకు క్షమాపణ చెప్పండి కెసిఆర్ గారూ, అప్పుడే తెలుగు అనే పదానికి మీరు ఏమి చేసినా సార్ధకత ఉంటుంది...