జాతీయ రాజకీయాలలో చోటుచేసుకుంటున్న పరిణామాలు తెలంగాణలో జరగనున్న ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. తెలంగాణలో తెలుగుదేశం ఎక్కడ అన్న పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ కీలకంగా మారబోతోంది. చంద్రబాబు అందించిన స్నేహ హస్తాన్ని కేసీఆర్‌ అందుకుని ఉంటే జాతీయ రాజకీయాలలో చంద్రబాబు ఇంత క్రియాశీలంగా ఇప్పుడు వ్యవహరించి ఉండేవారు కాదు. దక్షిణాది పార్టీలను సంఘటితం చేసి రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకోవడానికే పరిమితం కావాలనుకున్న చంద్రబాబు, ఇప్పుడు జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేయబోతున్నారు.

kcr 04112018

ఇప్పుడు కేసీఆర్‌, కేటీఆర్‌ వాడుతున్న భాష పట్ల కూడా ప్రజల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సభలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తీవ్ర పదజాలంతో విమర్శించడం ఆయనకు చాలా నష్టం చేసింది. చంద్రబాబును తిట్టడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలింపజేయవచ్చునన్న కేసీఆర్‌ వ్యూహం అడ్డం తిరిగింది. కేసీఆర్‌ వ్యాఖ్యలతో సెటిలర్లు దూరం కావడమే కాకుండా తెలంగాణ వాళ్లు కూడా ‘విడిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నప్పుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని అంతలా తిట్టడం ఎందుకు?’ అని అభిప్రాయపడుతున్నారు.

kcr 04112018

మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. రెండు నెలల క్రితంనాటి పరిస్థితికి, ప్రస్తుతం ప్రజల నాడికి మధ్య పోలికే లేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశంతో దాదాపు రెండు నెలల క్రితం శాసనసభను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులకు అందనంత దూరంలో ఆయన ఉన్నారు. సెంచరీ కొడతామని అధికార పార్టీ ప్రకటించగా 80 నుంచి 90 సీట్ల వరకు ఢోకా ఉండదని వివిధ సర్వేలలో కూడా వెల్లడైంది. అయితే అప్పుడు కేసీఆర్‌కు పూర్తి అనుకూలంగా ఉన్న పరిస్థితి.. ఇప్పుడు క్రమంగా మారుతూ వస్తోంది. శాసనసభ రద్దు నాటికి తిరుగులేని వ్యక్తిగా ఉన్న కేసీఆర్‌ ఇప్పుడు కాంగ్రెస్‌పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. తాజాగా జరిపిన ఒక సర్వే ప్రకారం తెలంగాణలో ఇప్పుడు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉందని స్పష్టమవుతోంది.

kcr 04112018

తెలుగుదేశం పార్టీ జత కట్టిన తరవాత కాంగ్రెస్‌ దశ మారింది. కాంగ్రెస్‌, తెలుగుదేశం, సీపీఐ, టీజేఎస్‌తో కూడిన మహా కూటమికి అంకురార్పణ జరగడంతో క్షేత్రస్థాయిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. చంద్రబాబును తిట్టడం ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలింపజేయవచ్చునన్న కేసీఆర్‌ వ్యూహం అడ్డం తిరిగింది. కేసీఆర్‌ వ్యాఖ్యలతో సెటిలర్లు దూరం కావడమే కాకుండా తెలంగాణ వాళ్లు కూడా ‘‘విడిపోయి ఎవరి బతుకు వారు బతుకుతున్నప్పుడు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని అంతలా తిట్టడం ఎందుకు??’’ అని అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీని తక్కువగా అంచనా వేసిన కేసీఆర్‌కు, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీని కలుపుకొని బలం పుంజుకుంటున్న కాంగ్రెస్‌ పార్టీ చుక్కలు చూపించబోతోంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కూడా కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో ఇబ్బందికరంగా మారబోతున్నాయి. భారతీయ జనతా పార్టీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేస్తున్న చంద్రబాబు, కేసీఆర్‌ ఎటువైపు ఉంటారో ఆయనే చెప్పాలని చంద్రబాబు సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌కు స్పందించలేని పరిస్థితి కేసీఆర్‌ది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read