కేసీఆర్ అంటేనే తీయని మాటలు చెప్పటం, చివరకు చేతులు ఎత్తేయటం, ఆయన మార్క్ రాజకీయం అలాగే ఉంటుంది. తన అనుకూలత కోసం వాడుకుంటారు, సేఫ్ జోన్ లో ఉన్నాం అనుకున్న సమయంలో, మధ్య దారిలో వదిలేస్తారు. కేసీఆర్ ను నమ్మిన ఎవరికైనా ఎదురయ్యే అనుభవమే ఇది. చంద్రబాబుని అలాగే చేసారు. సోనియా గాంధీ తెలంగాణా ఇస్తే పార్టీని విలీనం చేస్తాం అన్నారు, చివరకు అదే కాంగ్రెస్ పార్టీని తెలంగాణాలో లేకుండా చేయటానికి, బీజేపీతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు. దళితుడిని తెలంగాణా మొదటి ముఖ్యమంత్రి చేస్తానన్నారు. ఇక హామీలు అయితే, ప్రతిదీ తల న-రు-క్కుం-టా అంటూ హామీలు ఇచ్చి, చివరకు అది చేసే వారు కాదు. ఇక ఆలె నరేంద్ర, విజయశాంతి, నిన్నటి ఈటేలె వరకు అందరూ కేసీఆర్ ని నమ్మి, బొక్క బోర్లా పడిన వాళ్ళే. ఇదే కోవలో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కూడా చేరిపోయారు. కేసీఆర్ తనకు ఎన్నికల్లో సహకరించి, చంద్రబాబుని ఓడించారనే ఉత్సాహంలో, కేసీఆర్ తో విందులు, కౌగలింతలు, విజయసాయి కాళ్ళ మీద పడటాలు, ఇలా అనేక సీన్లు చూసాం. ఇవి ఇక్కడ వరకు అయితే పరవాలేదు కానీ, గోదావరి నీటిని వాడుకే విషయంలో, కేసిఆర్ ఈజ్ మ్యగ్నానిమస్, నీకు ఏమి తెలియదు కూర్చో అంటూ చంద్రబాబుని హేళన చేసిన జగన్ కు, ఇప్పుడు కేసీఆర్ మార్క్ షాక్ తగిలింది.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీఫన్ రవీంద్రను, ఏపి ఇంటలిజెన్స్ చీఫ్ ని చేయాలని అనుకున్నారు. ఆయన తెలంగాణా క్యాడర్ లో ఉండటంతో, ముందు కేసీఆర్ సమ్మతి అడిగి, కేసీఆర్ ఒప్పుకోగానే, కేంద్రంలో లాబీ మొదలు పెట్టారు. శ్రీలక్ష్మిని పంపించే సమయంలో, కేంద్రం కూడా ఒప్పుకుందనే వార్తలు వచ్చాయి. కేసీఆర్ కూడా ఈ రెండేళ్ళ నుంచి, స్టీఫెన్ రవీంద్రకు పెద్ద పదవి ఇవ్వలేదు. ఒకానొక సమయంలో, స్టీఫన్ రవీంద్ర సెలవు పై ఉన్నారని, ఆయన అనధికారికంగా ఏపి విషయాలు చూస్తున్నారనే వార్తలు వచ్చాయి. వైసీపీ వర్గాలు కూడా ఢిల్లీ నుంచి అనుమతి ఉందని, మేము అడిగితే ఢిల్లీ వాళ్ళు కాదనరు అనే విధంగా డబ్బా కొట్టారు. అయితే ఇప్పుడు కేసీఆర్, జగన్ కు తన మార్క్ షాక్ ఇచ్చారు. స్టీఫన్ రవీంద్రను హైదరబాద్ సిపీగా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇన్నాళ్ళు ఆశలు పెట్టుకున్న జగన్ కు షాక్ తగిలినంత పని అయ్యింది. కేసీఆర్ ని ఎక్కువగా నమ్మితే ఏమి అవుతుందో,ఇప్పుడు జగన్ బ్యాచ్ కు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది.