జనసేన అధినేత పవన్ కళ్యాణ్, స్వయంగా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంటికి వెళ్లి మరీ కలిసారు... తొలిసారిగా పవన్, ప్రగతి భవన్‌కు వెళ్లి కెసిఆర్ ను కలవటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది... దాదాపు అరగంట పైనే ఇద్దరూ భేటీ అయ్యారు... కేసీఆర్‌కి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపి ప‌లు అంశాల‌పై మాట్లాడనున్నట్లు స‌మాచారం... త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఇక ఆక్టివ్ రాజకీయాల్లో ఉంటాను అని చెప్తున్న పవన్, కెసిఆర్ ని కలవటం ప్రాధాన్యత సంతరించుకుంది... తెలంగాణ రాజకీయాల్లో సరి కొత్త రాజకీయ సమీకరణాలు ఏమన్నా ఉంటాయా అనే చర్చ కూడా జరుగుతుంది...

kcr pawan 01012018 2

అయితే వస్తున్న సమాచారం మేరకు, పవన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, జరిగిన పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. పవన్ కూడా తన దగ్గరకు వచ్చిన కొన్ని సమస్యలు కెసిఆర్ దృష్టికి తీసుకువెళ్ళి, వాటిని తగు రీతిలో పరిష్కరించమన్నారు అని సమాచారం.. అలాగే కేంద్ర వైఖరి పై కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తుంది... ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై కూడా ఇరువురూ చర్చించుకున్నారు... సీనియర్ గా ఉన్న కేసీఆర్ దగ్గర సలహాలను పవన్ తీసుకున్నట్లు తెలుస్తోంది... మరి విభజన సమస్యలు, ఉమ్మడి ఆస్తుల విభజన మీద, ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన వాటి మీద, పవన్ కెసిఆర్ ను ఏమన్నా అడిగారా లేదా అనేది తెలియాల్సి ఉంది...

kcr pawan 01012018 3

రాష్ట్ర విభజన తనను బాధించింది అని, 11 రోజులు అన్నం మానేసాను అని, సీమంద్రుల మీద దాడులు బాధించాయి అని చెప్పిన పవన్, ఇప్పుడు వాటి అన్నిటికీ కారణం అయిన కెసిఆర్ ను కలవటం ఆసక్తికరంగా ఉంది... కెసిఆర్, పవన్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కూడా జరిగింది... ఇంకా చెప్పాలి అంటే, ఇప్పటి వరకు పవన్ ను రాజకీయంగా బాగా విమర్శించింది కెసిఆర్ మాత్రమే... నంద్యాల ఎన్నికలప్పుడు కూడా కెసిఆర్, పవన్ పోటీ చేస్తే 1 శాతం ఓట్లు కూడా రావు అంటూ ఎద్దేవా చేసారు... అయితే కొన్ని రోజుల క్రిందట, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా... గవర్నర్‌ ఇచ్చిన విందులో కేసీఆర్‌, పవన్‌కల్యాణ్‌ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇప్పడు మరోసారి ఇద్దరు ఎకాంతంగా భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది... ఈ భేటీతో రాజకీయంగా ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read