ఎన్నెన్ని ప్రగల్భాలు పలికాడు. దేశమంతా తన వెంట వచ్చేస్తుందని నమ్మబలికాడు. టీఆర్ఎస్ కి సమాధి కట్టి దాని పునాదులపై బీఆర్ఎస్ కి శంకుస్థాపన చేశాడు. తరగని డబ్బుని నమ్ముకుని తెలంగాణ జాతిపిత కాస్తా జాతీయ నేత అవతారం ఎత్తాడు. అయితే నాలుగు మీటింగ్లు, పది మంది అవుట్ డేటెడ్ లీడర్ల చేరికలు.. అంతకు మించి బీఆర్ఎస్ సాధించింది ఏమీ లేదు. మోదీని దింపేస్తా, ఢిల్లీ పీఠమెక్కేస్తా అని కలలు కంటుంటే..వివిధ రాష్ట్రాల నేతలు, బీజేపీయేతర జాతీయ పార్టీలన్నీ స్టాలిన్ వైపు చూస్తున్నాయి. కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్ని చూపించి కవితని రక్షించుకోవడం మినహా ఇంకే ప్రయోజనమూ, ఇంకొక ప్రత్యామ్నాయం కనపడటంలేదు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పాత్రధారులు చాలా మందిని అరెస్టు చేశారు. సూత్రధారి అని చెబుతున్న కేసీఆర్ ముద్దుల తనయ కవితని విచారణకి పిలిచి వదిలేస్తారా? ఇప్పుడు ఈ అనుమానమే కేసీఆర్‌కి, బీఆర్ఎస్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వటం, అదే సమయంలో కవిత ఢిల్లీలో ధర్నా నిర్వహించడం పెద్ద స్కెచ్ వేశామనుకుంటున్నారు. కానీ అటువైపు నుంచి తరుముతోంది అనకొండ. తెలంగాణ జిల్లాల ప్రజాప్రతినిధులందరినీ పిలిపించుకుని ఢిల్లీపై ఏం ఒత్తిడి తెస్తారో ఏమో కానీ గులాబీ దళపతి వ్యూహం ఏంటో తెలియక నేతలు తికమక పడుతున్నారు. అరెస్టు కాకుండా ఏం చేయాలి? అరెస్టయితే ఏం చేయాలనేది ఇప్పటికీ క్లారిటీ లేదు.
అయ్యో కేసీఆర్.. రణం లేదు.. శరణమేనా ?
Advertisements