తెలంగాణపై కమలనాథులు గురిపెట్టారు. నాలుగు వైపుల నుంచీ తరుముతూ వస్తూ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఒక వైపు ఢిల్లీ లిక్కర్ కేసు కేసీఆర్ కూతురు కవిత మెడకే చుట్టుకునేలా ఉంది. ఆమె అరెస్టు దగ్గర పడిందని తెలుస్తోంది. ఇదే సమయంలో బీజేపీ వాయిస్ అని పేరుపడిన షర్మిల రాష్ట్రపతి పాలన గళం ఎత్తుతోంది. బీఆర్ఎస్ అని ఎంత పెద్ద సౌండ్ చేసినా, కమలనాథులు కనికరించే అవకాశంలేదని కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా స్టేట్మెంట్ నిర్ధారిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని, చిన్న చిన్న విషయాలు పక్కన పెట్టి పని చేయాలని తెలంగాణ బీజేపీ నేతలని ఆదేశించారు షా. తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలపై అమిత్‌షా సీరియస్ గా స్పందించడంతో నేతలు అవాక్కయ్యారు. విభేదాలు పక్కనపెట్టటి, నేతలంతా కలిసి కష్టపడి పనిచేయాలని అమిత్‌షా ఆదేశించారు. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించాలని, అనంతరం ఉమ్మడి జిల్లాలవారీగా సమావేశాలు నిర్వహించాలని, చివరిగా రాష్ట్ర స్థాయిలో బహిరంగ సభ నిర్వహించాలని సూచించారు. పార్టీలోకి చేరికలను వేగవంతం చేయాలన్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకోవడం మినహా నాకు వేరే పనిలేదు, నా ఫోకస్ అంతా తెలంగాణపైనే అనే అర్థం వచ్చేలా అమిత్ షా చెప్పడంతో టి బీజేపీ నేతలు విషయంలో స్పష్టత వచ్చింది. తెలంగాణ బీజేపీలో కిషన్ రెడ్డి ఒక వర్గంగా, సంజయ్ మరో వర్గంగా, అర్వింద్ ఇంకో వర్గంగా గ్రూపు రాజకీయాలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమిత్ షా హెచ్చరిక ఇటు బీజేపీ నేతలకు, అటు బీఆర్ఎస్ నేతలకు గుబులు రేపుతోంది.
కమల వ్యూహంలో కేసీఆర్.. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందోనని టెన్షన్
Advertisements