ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గతంలో పెట్టుబడులు పోటీ, నదులు అనుసంధానం చేసిన చరిత్ర, ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్డుల నిర్మాణం, పెట్టుబడులు, ఇలా అభివృద్ధిలో దూసుకుపోయేది. చంద్రబాబు దిగిపోయి, జగన్ మోహన్ రెడ్డి రాగానే, సీన్ మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనే మాట లేకుండా పోయింది. కేవలం అప్పులతో నెట్టుకుని వస్తున్నారు. అభివృద్ధి అనే మాట లేకుండా పోయింది. దీంతో పక్క రాష్ట్రం వారికి కూడా మనం అంటే కామెడీ అయిపొయింది. ఈ రోజు కేసీఆర్ మాట్లాడారు. పక్క రాష్ట్రం ఆంధ్రాలో అంతా గల్లంతు అయితే, మనం అభివృద్దిలో దూసుకుపోతున్నాం అన్నారు. పంట పండించటంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మనం ఎక్కడ ఉన్నాం అంటూ పోల్చి చూపించారు. దీంతో ఏపి ప్రజు బాధపడటం మినహా చేసేది ఏమి లేదు. షర్మిల అన్నట్టు, తెలంగాణా ఇలా దూసుకుపోటానికే, జగన్, కేసిఆర్ కలిసి, ఉమ్మడి శత్రువు అయిన చంద్రబాబుని ఓడించారు ఏమో అని టిడిపి నేతలు అంటున్నారు. ఇప్పటికే ఇరిగేషన్ రంగంలో, నీళ్ళు వాడుకుంటూ ఏపికి నష్టం చేస్తున్న ఏమి చేయలేని పరిస్థితిలో జగన్ ఉన్నారని, అలాగే ఇక్కడ కంపెనీలు అన్నీ తెలంగాణా వెళ్ళిపోయి అక్కడ అభివృద్ధి చెందుతుందని వాపోతున్నారు. చంద్రబాబు అనే వ్యక్తి లేకపోతే, అందరికీ అలుసే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
కేసీఆర్ మాటల్లో, "ఇక్కడున్న ఆంధ్రా వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పా, పద్దాక ఏమి ఆంధ్రా అంటావ్ అయ్యా, ఎప్పుడో వచ్చావ్ 40 ఏళ్ళ క్రిందట హైదరాబాద్ కు, ఐ యాం ఏ హైదరాబాదీ అని చెప్పుకో అని చెప్పా. అంతే కదా. ఇక్కడ బ్రతికి ఉండి, పద్దాక ఏమి ఆంధ్రా దుకాణం అయ్యా నాకు అర్ధం కాదు. వాళ్ళలో కూడా ఇప్పుడు మార్పు వచ్చింది. మొన్నటి దాకా వారికి కొంత అనుమానం ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఏమైంది ఇప్పుడు పరిస్థితి, ఆంధ్రాలో గల్లంతు అయ్యింది, మనకు ఇక్కడ తెలంగాణాలో దూసుకుపోతున్నాం. వాళ్ళు మొన్నటి దాకా మనలని ఎక్కిరించారు. మీకు వండుకోవటం రాదు, మీకు తినటం రాదు, పంటలు పండించటం రాదు అని గతంలో హేళన చేసారు. ఇప్పుడు ఏమైంది ? ఇప్పుడు ఆంధ్రాలో పండిన పంట ఎంత, ఇప్పుడు మన దగ్గర పండిన పంట ఎంత ? ఇది ఒక్కటే మనకు వారికి గీటు రాయి. ఇంకా ఏమి అవసరం లేదు మనకు, వాళ్లతో పోల్చుకోవటానికి, ఎఫ్సీఐ వాళ్ళు ఆంధ్రా నుంచి కొంటుంది ఎంత, మన దగ్గర నుంచి కొంటుంది ఎంత ? అధికారిక లెక్కలు చెప్తున్నాయి, ఇద్దరి మధ్య తేడా" అంటూ కేసీఆర్ మాట్లాడారు.