చంద్రబాబు ఎంటర్ అయిన తరువాత, తెలంగాణా ఎన్నికలు కూడా, ఢిల్లీ వెర్సస్ తెలుగోడు అనే సీన్ కి మారిపోయాయి. ఎందుకంటే, చంద్రబాబుని దెబ్బ తియ్యటానికి, కేసీఆర్, మోడీతో కలిసి వెయ్యని ఎత్తులు లేవు. అందుకే చంద్రబాబు కూడా, దీనికి విరుగుడుగా , కాంగ్రెస్ ని కలుపుకుని, ఢిల్లీ పై యుద్ధం ప్రకటించారు. ఢిల్లీకి సహకరిస్తున్న, మన సొంత ప్రాంత ద్రొహులను శిక్షించమని పిలిపు ఇచ్చారు. చంద్రబాబు ప్రయత్నాలు, చంద్రబాబు చేస్తుంటే, కేసీఆర్ కూడా, మోడీ సాయంతో కలిసి, దెబ్బ వెయ్యటానికి రెడీ అయ్యారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఉంచిన తన కోవర్ట్ లని వాడుకున్నాడు. తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత, ఒకరు కేసీఆర్ కోవర్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే. వీటి ద్వారా తన ప్లాన్ ఇంప్లెమెంట్ చెయ్యటానికి కేసీఆర్ రెడీ అయ్యారు.

kcr 13112018 2

కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో దాదాపుగా 25-30 అభ్యర్ధులను, కేసీఆర్ చెప్పిన పేర్లు ఈ కోవర్ట్ లు పెట్టించారు. అక్కడ బలమైన నాయకులని కాకుండా, వీక్ కాండిడేట్ లని, అలాగే కోవర్ట్ లని పెట్టించారు కేసీఆర్. ఈ లిస్టు ఢిల్లీకి కూడా చేరిపోయి, శనివారం ప్రకటిస్తారు అనే టైంలో, విషయం మొత్తం చంద్రబాబుకి తెలిసింది. వెంటనే చంద్రబాబు, రాహుల్ గాంధీకి విషయం మొత్తం చెప్పారు. అంతే కాదు, రాహుల్‌ గాంధీకి ఇదే విషయం రేవంత్‌ మెయిల్‌ చేసారు. రేవంత్‌తో పాటు విజయశాంతి, స్ర్కీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌, ఒకరిద్దరు కాంగ్రెస్‌ శ్రేయోభిలాషులు కూడా అవకతవకలను ఈమెయిల్‌ ద్వారా రాహుల్‌ దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న నాయకులకు అవకాశం ఇవ్వకుండా, ఎవరి ఎవరికో ఇచ్చారనే సమాచారం రాహుల్ గాంధీకి చేరింది.

kcr 13112018 3

దాంతో, ఆయన అప్రమత్తమయ్యారు. ఫిర్యాదులపై ఆరా తీశారు. అభ్యర్థులపై రహస్య నివేదికలు తెప్పించుకున్నారు. తనకు వచ్చిన సమాచారం నిజమేనని ధ్రువీకరించుకున్నారు. దాంతో, తొలి జాబితా ప్రకటనను నిలిపివేసి, హుటాహుటిన ఢిల్లీకి రావాలని కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి ఖుంటియా, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలను ఆదేశించారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వచ్చిన వెంటనే జాబితాపై ఇద్దరినీ తీవ్రంగా మందలించినట్లు సమాచారం. వారు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే.. తన వద్ద ఉన్న జాబితా చూపించి.. ‘‘ఇదేం జాబితా!? నేను చెప్పిందేమిటి!? జరిగిందేమిటి.?’’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పారాచూటర్లతోపాటు క్రోనీ క్యాపిటలిస్టులు, కోవర్టులకు ఎందుకు సీట్లు ఇస్తున్నారంటూ ప్రశ్నించినట్లు సమాచారం.

kcr 13112018 4

అవకతవకలు జరిగాయని చెబుతున్న కనీసం 25 మంది పేర్లను ఆయన వారి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఒక్కో పేరును ప్రస్తావించి.. వారి నేపథ్యం కూడా రాహుల్‌ చెప్పడంతో ఉత్తమ్‌, ఖుంటియా నిర్విణ్ణులైనట్లు సమాచారం. అభ్యంతరాలున్న పేర్లపై సమీక్ష చేసి మళ్లీ జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. దాంతో, సోమవారం రాత్రి పొద్దుపోయాక మొదటి జాబితా విడుదల చేసారు. ఇదే జరక్కపోయి ఉంటే, కేసీఆర్ వ్యూహం పారేది. ఈ 30 చోట్ల, బలంగా ఉన్న నేతలు గొడవలు చేసే వారు, రెబెల్స్ గా వేసే వారు, కూటమి ఫెయిల్ అనే ప్రచారం మొదలయ్యేది. అంతే కాదు తన కోవర్ట్ ల ద్వారా, మరింత బలహీన పరిచే వారు. ఇప్పుడు కేసీఆర్ అనుకున్నది జరగలేదు. చంద్రబాబు అప్రమత్తంగా ఉండటంతో, పెద్ద ప్రమాదమే తప్పింది. చంద్రబాబు వేసిన దెబ్బతో, కేసీఆర్ చివరి రాజకీయ ప్రయత్నం కూడా బెడిసి కొట్టింది. ఇక ప్రజా తీర్పు కోసం ఎదురు చూడటమే...

Advertisements

Advertisements

Latest Articles

Most Read