ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు పై ప్రశంసల జల్లు కురిపించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. పట్టిసీమ నిర్మాణాన్ని కేసీఆర్‌ పరోక్షంగా ప్రశంసించారు. పట్టిసీమ నిర్మాణం చేపట్టి చంద్రబాబు డెల్టాకు ప్రాణం పోశారని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఏపీ పట్టిసీమతో డెల్టాను కాపాడుకుందని ఆయన చెప్పారు. పట్టిసీమ తరహాలో సీతారామ ప్రాజెక్ట్‌ పూర్తిచేస్తామని కేసీఆర్‌ ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ మంటలు మండుతున్న సమయంలోనూ పట్టిసీమపై కేసీఆర్‌ ప్రశంసలు జల్లు కురిపించడంతో తెలుగు రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలోని సీతారామ ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన సందర్భంలో ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టుపై పరోక్షంగా ప్రశంసలు చేశారు.

kcr 05042019

ఏపీలోని డెల్టా ప్రాంతాన్ని పట్టిసీమ ప్రాజెక్టు కాపాడిందని, అదే తరహాలో తెలంగాణలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి ఇక్కడి రైతులకు అండగా ఉంటామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పట్టిసీమ ప్రాజెక్టుపై వైసీపీ అధినేత జగన్ తరచుగా విమర్శలు చేస్తుంటారు. జగన్ కు మద్దతుగా నిలుస్తున్న కేసీఆర్ అదే ప్రాజెక్టుపై ప్రశంసలు కురిపించడం గమనార్హం. జగన్‌తో కలిసి పనిచేస్తామని చెబుతున్న కేసీఆర్ చంద్రబాబును ప్రశంసించడంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. వాస్తవాన్ని ఎవరైనా కాదనలేరని టీడీపీ శ్రేణులు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు. పట్టిసీమ విషయంలో చంద్రబాబు కృషిని కేసీఆర్ ప్రశంసిస్తుంటే.. జగన్ మాత్రం పట్టిసీమపై అసత్య ప్రచారం చేయడమేంటని టీడీపీ నేతలు మండిపడతున్నారు..

Advertisements

Advertisements

Latest Articles

Most Read