కేంద్ర ప్రభుత్వ షరతులకు తలొగ్గి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రైతులు వాడే కరెంటుకు మీటర్లు పెడుతున్న విషయం తెలిసిందే. అయితే గత మూడు దశాబ్దాలుగా, రైతులుకు మీటర్లు లేవని, ఉచిత విద్యుత్ అనే దానికి, మీటర్లు పెడితే అర్ధం ఉండదని, వాదనలు వినిపిస్తున్నాయి. పైగా ఈ మీటర్లు పెట్టటం వల్ల ప్రభుత్వానికి అదనపు ఖర్చు అని, అలాగే రైతులకు కూడా భరోసా ఉండదని, తరువాత మీటర్ రీడింగ్ పలానా దాటితే, చార్జ్ చేస్తాం అని చెబితే పరిస్థితి ఏమిటి అనే వాదనలు కూడా వచ్చాయి. ఇప్పుడు కేంద్రానికి తలొగ్గి, ఎక్కువ అప్పు తెచ్చుకోవటానికి, ఇలా చేస్తుంటే, మీరు ఉచిత విద్యుత్ ఎత్తేస్తేనే ఎక్కువ అప్పు ఇస్తాం అని కేంద్రం అంటే, అప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అలాగే ఇప్పుడు దిస్కంలకు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక, బాకీ పడుతుందని, మరి నెల నేలా రైతులకు ఎలా నగదు బదిలీ చేస్తారు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇలా ఆంధ్ప్రరదేశ్ ప్రభుత్వం తీసుకున్న, నిర్ణయం పై, అనేక ప్రశ్నలు, అనేక విమర్శలు, అనేక విశ్లేషణలు వస్తున్న వేళ, పక్కన ఉన్న తెలంగాణా ప్రభుత్వం తన అభిప్రయాన్ని చెప్పింది.
నిన్న అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ, కేంద్రం ప్రతిపాదిస్తున్న సవరణల పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది ఒక రాక్షస చట్టం అని, ఇవి అమలు చేస్తూ, రాష్ట్రాలు ఏమి కావాలని, ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్రం ప్రతిపాదనలు అమలులోకి వస్తే, రైతులకు ఇచ్చే సబ్సిడీ ఆగిపోతుందని కేసీఆర్ అన్నారు. మీటర్లు పెడుతున్నాం కాబట్టి, వసూలు చేయ్యమంటారని కేసిఆర్ అన్నారు. ఇప్పుడు ఈ మీటర్లు ఖర్చు రాష్ట్రాలు భరించాలని, తెలంగాణా ప్రభుత్వానికి ఈ మీటర్లు కొనాలి అంటే 750 కోట్ల ఖర్చు అవుతుందని, ఈ భారం అంతా రైతుల పైనే మోపాలని, వేరే మార్గం లేదని కేసిఆర్ అన్నారు. ఒకప్పుడు గ్రామాల్లో విద్యుత్ బిల్లు కలెక్టర్లు వస్తుంటే, ప్రజలు బెదిరిపోయే వారని, ఆ సంఘటనలు ఇంకా మాకు గుర్తున్నాయని, ఇప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి వచ్చే అధికారం ఉందని అన్నారు. ఈ విషయం పై రెండు తెలుగు రాష్ట్రాలు రెండు రకాలుగా స్పందించాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయం సమర్ధిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, కేసీఆర్ కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించారు.