తెలంగాణా ప్రజా తీర్పుని అందరూ గౌరవించాల్సిందే. ప్రజాస్వామ్యంలో, ప్రజల తీర్పే ఫైనల్. అది ఎలా గెలిచినా, ఓడిన వాడు ఎన్ని కారణాలు చెప్పినా, గెలుపు గెలుపే. అయితే గెలిచిన వాడు అహంకారంతో విర్రవీగితే, అది అతని పతనానికే నాంది అవుతుంది. ఈ రోజు కేసీఆర్ గెలిచిన తరువాత పెట్టిన ప్రెస్ మీట్ లో, మరో సారి చంద్రబాబు పై అవాక్కులు చావాక్కులు పెలాడు. ఏపీ రాజకీయాల్లో ప్రవేశిస్తామని అంటున్నారు కదా... ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తారా? ప్రత్యేకంగా పార్టీనే ఏర్పాటు చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కేసీఆర్ స్పందిస్తూ, ఈ విషయంలో ఏదైనా జరగొచ్చు అని.... దానికి కాలమే సమాధానం చెబుతుందని అంటూనే, చంద్రబాబు ఇక్కడకు వచ్చినప్పడు తాము అక్కడకు వెళ్లమా అని ప్రశ్నించారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి పనిచేశారు, మరి తాము కూడా ఆంధ్రకు వెళ్లి పనిచేయాలా వద్దా అని అన్నారు.
బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వమా? చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, చంద్రబాబు గురించి విజయవాడ వెళ్లి మొత్తం చెబుతాను, తమ గిఫ్ట్ ప్రభావం ఎంతుంటుందో త్వరలో అందరూ చూస్తారు అంటూ, అహంకారంతో సమాధానం చెప్పారు. కొన్ని రోజుల క్రిందట కేటీఆర్ కూడా, చంద్రబాబు అంతు చూస్తాం, ఏపి రాజకీయాల్లో వేలు పెడతాం అని చెప్పిన విషయం తెలిసిందే. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లారు అంటే, ఆయన అక్కడ 9 ఏళ్ళుగా పని చేసారు, తెలంగాణాలో సామాజిక, ఆర్ధిక మార్పులకు కారణం అయ్యారు కాబట్టి, ఆ హక్కుతో అక్కడకు వెళ్లి ప్రచారం చేసారు. మరి కేసీఆర్ కు ఆంధ్రా వచ్చే హక్కు ఏమి ఉంది ? ఆంధ్రా వాళ్ళని దెయ్యం అని తిట్టినందుకా ? ఆంధ్రా వాళ్ళ బిర్యానీ పెంట లాగా ఉంటుంది అన్నందుకా ? ఆంధ్రా వాళ్ళు రాక్షసులు అన్నందుకా ? ఏ హక్కుతో నువ్వు విజయవాడ వచ్చి, మా ముఖ్యమంత్రిని అంటావ్ కేసీఆర్ ?
నువ్వు ఏపి వచ్చి, ఎంతగా ఆయనను తిడితే నాలుగు ఓట్లు ఎక్కువే పడతాయే తప్ప ఒక్క ఓటు కూడా తగ్గదు అని ఏపి ప్రజలు అంటున్నారు. నువ్వు అంతు చూస్తా ఉంటే ఆయన, ఆయన్ను నమ్ముకున్న ఏపి ప్రజలు చూస్తూ ఉంటారు మరి. ఎలాగూ మీ రహస్య స్నేహితులు, జగన్, పవన్, బీజేపీ ఉన్నారుగా, నీ ఇంకో కాలు పెట్టినంత మాత్రాన, చంద్రబాబుకి ఏమి కాదులే. మా ఏపి ప్రజలు గొర్రెల మంద కాదు, నీ లాంటి సొల్లు వాగుడు వినాటానికి. నీ వల్ల సర్వం కోల్పోయి, రోడ్డున పడ్డ రాష్ట్రం మాది. నీలాంటి వాళ్ళని వెనకేసుకుని వచ్చే కుల పిచ్చ వెధవలు, మా రాష్ట్రంలో ఉన్నారు, వాళ్లకి సరైన బుద్ధి చెప్తాం. హాయగా ఎన్నికలు గెలిచావ్, ఫార్మ్ హౌస్ లో పార్టీ చేసుకో. మా ముఖ్యమంత్రి జోలికి వస్తే, ఏమి చెయ్యాలో మా ప్రజలకి బాగా తెలుసు. ఇప్పటికే మోడీ, జగన్, పవన్ కలిసి ఎన్నో కుట్రలు చేస్తున్నారో, నువ్వు వస్తే మాకు పెద్దగా ఊడేది ఏమి లేదు, మరింత గట్టిగా, కసిగా పని చేసి, మా ముఖ్యమంత్రిని కాపాడుకుంటాం. మేము ఆంధ్రులం, గొర్రెల మందలం కాదు. నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే, మా ఏపి ప్రజలు కూడా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి, మా ముఖ్యమంత్రిని గెలిపించుకుంటాం.