రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధన సమస్య నిరుద్యోగ సమస్య. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి, రెండు తెలుగు రాష్ట్రాల్లో, నిరుద్యోగ యువత అసహనంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గత చంద్రబాబు హాయంలో అనే ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి. రెండు సార్లు డీఎస్సీ కూడా వచ్చింది. ఇక ప్రైవేటు ఉద్యోగాలు అయితే లక్షల్లో వచ్చాయని, జగన్ ప్రభుత్వమే అసెంబ్లీలో ఒప్పుకుంది. అయినా సరే నిరుద్యోగ యువత అప్పట్లో చంద్రబాబు మీద ఆగ్రహంగా ఉండేది. ఆ సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి వారిని రెచ్చగొట్టారు. నేను అధికారంలోకి రాగానే 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని అన్నారు. ప్రతి జనవరి 1న జాబ్ క్యాలండర్ అన్నారు. అలాగే ప్రతి కాంట్రాక్టు ఉద్యోగస్తుడిని రెగ్యులర్ చేస్తానని అన్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, అనేక హామీలు ఇచ్చి, నిరుద్యోగ యువతను మంచి చేసుకున్నారు జగన్. తరువాత ఎన్నికల్లో గెలిచారు. ఇప్పటికి మూడు జనవరి 1లు వెళ్ళాయి కానీ, జాబ్ క్యాలండర్ అనేది మాత్రం రాలేదు. మధ్యలో ఒక జాబ్ క్యాలండర్ అని ఉత్తుత్తి జాబ్ క్యాలండర్ ఒకటి వదిలారు. దాని పైన పెద్ద ఎత్తున ఆందోళన చేసారు యువత. అందులో కేవలం 36 గ్రూప్ 1 పోస్టులు ఉన్నాయి. ఇక కేవలం వందల్లోనే పోలీస్ ఉద్యోగాలు ఉన్నాయి.
టీచర్ ఉద్యోగాల సంగతి ఊసే లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఊసురోమంటున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం, తాను ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని, ఇది దేశంలోనే ఎవరూ చేయలేదని, గర్వంగా చెప్పుకుంటున్నా అని అన్నారు. ఆ ఆరు లక్షల ఉద్యోగాలు ఏంటి అంటే, వాలంటీర్ ఉద్యోగాలు, బియ్యం వ్యాన్ డ్రైవర్ ఉద్యోగాలు, మద్యం షాపుల్లో ఉద్యోగాలు, ఆర్టీసీని ప్రభుత్వంలో తీసుకున్నాం కాబట్టి, ఆ ఉద్యోగాలు, ఇలా మొత్తం మాయ చేసి పెట్టారు. అప్పటి నుంచి జగన్ పై యువత ఆగ్రహంగా ఉంది. ఈ క్రమంలోనే, పుండు మీద కారంలో, కేసీఆర్ 90 వేల ఉద్యోగాలను నోటిఫై చేస్తున్నట్టు అసెంబ్లీలో చెప్పారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేసేసారు. దీంతో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పైన ఆ ఒత్తిడి వస్తుంది. జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చి కూడా, మూడేళ్ళు అయిపోతున్నా, ఏమి చేయటం లేదని, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది యువత. మరి కేసీఆర్ దెబ్బకు, విలవిలాడుతున్న జగన్.. నెక్స్ట్ ఏమి చేస్తారు అనేది చూడాలి మరి.