తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రా వారిని ఎలా తిట్టారో అందరికీ తెలిసిందే. తెలంగాణా ఉద్యమ సమయంలో ఇష్టం వచ్చినట్టు తిట్టిన తిట్లు అందరికీ గుర్తు ఉన్నాయి. అయితే, ఉద్యమ వేడిలో అలా అన్నారు అని చెప్పే వారు ఉన్నారు. అయితే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన సమయంలో కూడా కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కించ పరుస్తూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక థర్డ్ గ్రేడ్ స్టేట్ అని, దాంతో మా రాష్ట్రాన్ని పోల్చవద్దు అంటూ చెప్పిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే ప్రత్యేక హోదా పై, పోలవరం పై కూడా కేసీఆర్ మాటలు తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డి గారికి మాత్రం, రాజకీయ ప్రయోజనాలు ఎక్కువ. అందుకే కేసీఆర్ తో కలిసి, మొన్న ఎన్నికల్లో ఆయన దగ్గర నుంచి అన్ని సహాయాలు తీసుకుని పని చేసారు. చివరకు గెలిచి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసారు.

jagan 28092019 2

అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిగిన ఒక్క లాభం లేదు కాని, తెలంగాణాకు మాత్రం అన్నీ అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్. సెక్రటేరియట్ భవనాలు ఇవ్వటం దగ్గర నుంచి, గోదావరి నీళ్ళు మన డబ్బులతో తెలంగాణాకు తరలించటం దాకా విషయం వెళ్ళింది. అయితే ఇదే సమయంలో ఉమ్మడి ఆస్తుల విభజన కాని, 6 వేల కోట్ల విద్యుత్ బకాయలు కాని, మాట్లాడే వారే లేదు. ఇలాంటి సందర్భంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు జగన్. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఈ నెల 30న కేసిఆర్ తో కలిసి, శ్రీవారికి పట్టు వస్త్రాలు ధరిస్తారని సమాచారం ఇచ్చారు. అలాగే తిరుమలలో జరిగీ కొన్ని అభివృద్ధి పనులకు కూడా, కేసిఆర్ చేత శంకుస్థాపన చేసే ఏర్పాట్లు చేస్తున్నారు.

jagan 28092019 3

అయితే జగన్ తో పాటుగా, కేసీఆర్ సైతం స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.సాధారణంగా ఏపీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు శ్రీవారికి పట్టు వస్త్రాల సమయం లో పట్టు వస్త్రాలు ఇవ్వటం ఆనవాయితీ. అయితే ఇక్కడ, పక్క రాష్ట్ర సియం పట్టు వస్త్రాలు ఇవ్వటం ఏంటి అనే వాదన వినిపిస్తుంది. దీని పై శ్రీవారి భక్తులే కాదు, టిడిపి కూడా అభ్యంతరం చెప్తుంది. ‘‘తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ కేసీఆర్‌తో కలిసి ఇవ్వటమేంటి? టీటీడీని కూడా తెలంగాణకు కట్టబెట్టే చర్యలు జరుగుతున్నాయా? తెలంగాణ సీఎం చేతిలో ముఖ్యమంత్రి జగన్‌ కీలుబొమ్మలా మారుతున్నారు’’ అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు విమర్శించారు. శుక్రవారం ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఇద్దరి మధ్య ఎంత మిత్రత్వం ఉన్నా రాష్ట్ర హక్కులను పోగొట్టుకోకూడదని సూచించారు. గోదావరి నీటి తరలింపు ఆంధ్ర భూభాగంలోనే జరగాలని డిమాండ్‌ చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read