రేపు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి, రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయం పై, నిరసన తెలపటానికి చంద్రబాబు ప్రాణాలక రచిస్తున్నారు. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం పై, చంద్రబాబు ఎంపీలతో సమావేశం జరిపారు. బీజేపీయేతర ముఖ్యమంత్రుల్లో భావసారూప్యం ఉన్న వారితో సమన్వయం చేసుకోవడం ద్వారా ఈ సమావేశంలో వేడి పుట్టించాలన్న వ్యూహంలో ఆయన ఉన్నారు. దీనిపై ఆయన ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, కేరళ సీఎంలు మమతా బెనర్జీ, కుమారస్వామి, పినరయి విజయన్‌ వంటి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మిగిలిన సీఎంలతోనూ టచ్‌లో ఉన్నానని ఎంపీలకు చెప్పారు. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకుంటే ఆయా రాష్ట్రాల బృందాలు నీతి ఆయోగ్‌ భేటీని బాయ్‌కాట్‌ చేసే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.

kcr 16062018 2

అయితే ఇదే సందర్భంలో కెసిఆర్ ప్రస్తావన కూడా వచ్చింది. ఫెడరల్‌ ఫ్రంట్‌ పెడుతున్నానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మాత్రం చంద్రబాబు ఈ సంప్రదింపుల ప్రక్రియలో చేర్చకపోవడం విశేషం. ‘మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే విషయంలో కేసీఆర్‌ కలిసి రాకపోవచ్చు. ఆయనా, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అటూ ఇటూగా ఉన్నారు. వారి సమస్యలు వారివి. వారిని వదిలివేసి కలిసి వచ్చేవారిని కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాం’ అని తెలిపినట్లు సమాచారం. కేసీఆర్‌ కేంద్రానికి అనుకూలంగా ఉంటున్నట్లు కనిపిస్తోందని, శుక్రవారం ఢిల్లీలో ఆయన ప్రధానిని కలిసినప్పటి దృశ్యాల్లో కూడా వారు పరస్పరం సౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తోందని ఒక ఎంపీ వ్యాఖ్యానించారు.

kcr 16062018 3

నీతి ఆయోగ్‌ సమావేశంలో తమ వైఖరి ఎలా ఉంటే బాగుంటుందన్న అంశంపై చంద్రబాబు మిగిలిన ముఖ్యమంత్రుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. భావసారూప్యం ఉన్న వారంతా ఒకే వైఖరితో ఉంటే బాగుంటుందన్నది ఆయన యోచన. నీతి ఆయోగ్‌ సమావేశం తర్వాత ఆయన ఒక రోజు ఢిల్లీలో ఉంటారా లేక వెంటనే తిరిగొస్తారా అనేది ఇంకా స్పష్టంకాలేదు. అందరం ఒకసారి కలిస్తే బాగుంటుందని ఒకరిద్దరు సీఎంలు ఆయనకు ప్రతిపాదించారు. అవసరమని భావిస్తే ఆయన అక్కడే ఆగి వారిని కలిసే అవకాశముంది. ఇంతక ముందు కూడా కెసిఆర్, మోడీకి అనుకూలంగానే పని చేసారు. అవిశ్వాస తీర్మానం అప్పుడు, తన ఎంపీల చేత గొడవ చేపించటం, దక్షినాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తుందని అన్ని రాష్ట్రాలు కలిస్తే రాక పోవటం, కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ని, బీజేపీ ఆహ్వానించటం, ఇవన్నీ కెసిఆర్ - మోడీకి ఉన్న సంబంధాలు తెలియ చేస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read