అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాయలసీమని ప్రగతిపథంలోకి తీసుకెళ్తానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మాటలు నీటిమూటలేనని మరోసారి స్పష్టమైందని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. మూడేళ్ల క్రితం కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ, మూడేళ్లలో పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. మూడేళ్లు పూర్తి అయినా ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీనిపై సోషల్మీడియా వేదికగా ప్రతిపక్ష టిడిపి నేతలు వ్యంగ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 15వేల కోట్ల పెట్టుబడితో నిర్మించబోయే స్టీల్ ఫ్యాక్టరీకి 2019 డిసెంబరు 23న సీఎం జగన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి 25వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. పనిలో పనిగా తనకు అస్సలు సూటు అవ్వని చిత్తశుద్ధి, నిజాయితీ, విశ్వసనీయత అంటూ ఏవో కబుర్లు కూడా చెప్పారు. మూడేళ్లు పూర్తయ్యింది. కడప స్టీల్ ఫ్లాంట్ శిలాఫలకం వెక్కిరిస్తోంది. దీనిపై ప్రతిపక్ష టిడిపి నాడు జగన్ ఇచ్చిన హామీలు, నేటి దుస్థితిని వివరిస్తూ పోస్టులతో ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read