బీజేపీ కార్యకర్తల నుంచి ఎదురైన ఇబ్బందికర పరిస్థితి నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ బయటపడేశారు. కాలుష్యకాసారంగా మారిన యమునా నదిని ప్రక్షాళన చేయడం కోసం ప్రజలకు అవగాహన కల్పించాలని గంగాప్రక్షాళన జాతీయ పథకం, దిల్లీ జలమండలి నిర్ణయించి ఒక సమావేశం నిర్వహించాయి. దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌గడ్కరీ, కేంద్ర పర్యావరణమంత్రి హర్షవర్ధన్, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, పలువురు భాజపా ఎంపీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేజ్రీవాల్ ప్రసంగించడానికి ఉద్యుక్తులవ్వగానే, సభలోని భాజపా కార్యకర్తలు వేళాకోళంగా దగ్గడం ప్రారంభించారు.
వారిని వారించడానికి కేజ్రీవాల్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ‘‘మీరు నిశ్శబ్దంగా ఉంటే నేను మాట్లాడతాను’ అని పదేపదే పేర్కొన్నా భాజపా కార్యకర్తలు పట్టించుకోలేదు. మరింత బిగ్గరగా దగ్గడం ప్రారంభించారు. దీంతో కేజ్రీవాల్ అసహనంతో మాట్లాడటం ఆపేశారు. వేదికపై ఉన్న గడ్కరీ కల్పించుకున్నారు. ‘‘ఇది ప్రభుత్వ కార్యక్రమం. అందరూ నిశ్శబ్దం పాటించాలి’’ అన్నారు. ఆ ఒక్క మాటతో భాజపా కార్యకర్తల నోళ్లు మూతపడ్డాయి. అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ, ‘‘మమ్మల్ని నితిన్‌జీ ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీకి చెందినవారిగా చూడలేదు. నాకు మిగతా నాయకుల గురించి పెద్దగా తెలియదు. ఆయన మాపై కురిపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు’’ అని కృతజ్ఞతలు తెలిపారు.
ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న కేజ్రీవాల్, 40 ఏళ్లుగా దగ్గుతున్నారు. 2016లో బెంగళూరులో శస్త్రచికిత్స సైతం చేయించుకున్నారు. కేజ్రీవాల్ సమస్యను ఎగతాళి చేసేలా భాజపా కార్యకర్తలు దగ్గారు. అయితే గడ్కారీ కలగచేసుకోవటంతో, సైలెంట్ అయ్యరు. కేజ్రీవాల్ అంటే, రాహుల్ గాంధీ కంటే ఎక్కువ శత్రువగా చూసే, బీజేపీ అధిష్టానికి, గడ్కరీ చర్య మింగుడు పడటం లేదు. ఎగతాళి చేస్తే ఏమవుతుందని, ఆప్ కార్యకర్తలకు లేని బాధ గడ్కరీ ఎందుకంటూ, అమిత్ షా కోటరీలోని ఒక నాయుకుడు వ్యాఖ్యానించారు. గడ్కరీ ప్రవర్తన చూసి, అమిత్ షా, మోడీ బ్యాచ్ గత కొన్ని రోజులుగా, గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల, గడ్కరీ చేసిన వ్యాఖ్యలతో, మోడీ, షా హార్ట్ అయిన సంగతి తెలిసిందే.