దాదాపు పది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. వరదలకు ఒక్క గురువారమే 26 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఆగస్టు 8 నుంచి ఇప్పటిదాకా వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 97కు చేరుకుంది. పొరుగు రాష్ట్రం కేరళలోని వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. అంతే కాదు, ప్రజలను కూడా, తోచినంత సహాయం చేసి, కేరళ రాష్ట్రాన్ని ఆదుకోవల్సిందిగా కోరారు. ఇది చంద్రబాబు ట్వీట్ Have been receiving updates about areas affected badly by floods in Kerala. Taking all measures to help those stranded by floods & contributing Rs 5 Cr for relief work. Help the victims & donate to Kerala's Distress Relief Fund: https://donation.cmdrf.kerala.gov.in/

kerala 170820183 2

కేరళలో పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది. గురువారం సైతం భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. 14 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. సుమారు 1.67 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరికోసం కేరళ వ్యాప్తంగా 1,165 సహాయ పునరావాస శిబిరాలను ఏర్పాటుచేశారు. కోచితోపాటు కేరళలోని అనేక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కోచి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 26 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

kerala 170820183 3

శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ ప్రకటనతో శనివారం వరకు 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేరళ ముఖ్యమంత్రి విజయన్ ప్రధాని మోదీకి వివరించారు. 1200 కోట్ల తక్షణ సాయం అడగగా, కేంద్రం 100 కోట్లు ఇచ్చింది. మరోవైపు మారుమూల ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆంటకం ఏర్పడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రాణాలను దక్కించుకోడానికి వందలాది మంది ప్రజలు ఇంటి పైకప్పులు, పొడవైన భవంతులపైకి ఎక్కి తలదాంచుకుంటున్నారు. ఒక మారుమూల చర్చిలో కొందరు తలదాచుకున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు వరదల వల్ల దాదాపు రూ.8,000 కోట్ల మేర నష్టం వాటిళ్లింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read