ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు మరోసారి జాతీయ స్థాయిలో పోయింది. కేరళ రాష్ట్రానికి చెందిన సిపిఐ పార్టీ ఎంపీ బినోయ్ విశ్వం, జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు వచ్చి అక్కడ పరిస్థితి చూసి షాక్ తిని, వెంటనే జగన్ కు లేఖ రాసారు. ఆ లేఖ జాతీయ స్థాయిలో వైరల్ అవ్వటంతో, రాష్ట్ర పరువు పోయింది. కేరళ ఎంపీ విశ్వం, ఏపి సిపిఐ నిర్వహిస్తున్న కడప స్టీల్ ప్లాంట్ నిరసన కార్యక్రమంలో పాల్గునటానికి వచ్చారు. జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానం ప్రకారం, స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేయాలని పాదయాత్రలో పాల్గున్నారు. అయితే తుఫాన్ ప్రభావం కడప పై ఎక్కువగా ఉండటంతో, కార్యక్రమం వాయిదా పడింది. అయితే సిపిఐ నేతలతో కలిసి, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, అక్కడ పరిస్థితి చూసి షాక్ తిన్నారు. తుఫాన్ వస్తుందని కనీస సన్నద్ధత రాష్ట్ర ప్రభుత్వానికి లేదని జగన్ కు లేఖ రాసారు. అంతే కాదు, కడప కలెక్టర్ ని కలవటానికి అనేక సార్లు ప్రయత్నం చేసామని, కలెక్టర్ కనీసం అందుబాటులోకి రాలేదని అన్నారు.
సరే అని మేమే కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ కు వెళ్తే అక్కడ ఎవరూ లేరని, ఆ పక్కనే మరో బిల్డింగ్ లో కేవలం ముగ్గురు మాత్రమే విపత్తు నిర్వహణ కేంద్రంలో ఉండటం చూసి షాక్ తిన్నామని అన్నారు. అయితే అక్కడ వారిని అడగ్గా, రెండో శనివారం కావటంతో, ఎవరూ రాలేదని చెప్పారని, దానికి తాను తుఫాన్ కి రెండో శనివారం అని తెలియక వచ్చందని సమాధానం చెప్పినట్టు చెప్పారు. మీ సొంత జిల్లాలో ఇలాంటి పరిస్థితి చూసి షాక్ తిన్నానని, ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకోవాలి అంటూ , కేరళ ఎంపీ జగన్ కు ఘాటు లేఖ రాసారు. అయితే కేరళ ఎంపీ రాసిన ఈ లేఖ జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యింది. అన్ని జాతీయ మీడియా ఛానెల్స్ ఈ విషయాన్ని ప్రస్తావించాయి. దీంతో మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో పోయింది. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి గారు, సరైన చర్యలు తీసుకుని, రాష్ట్ర పరువు, ముఖ్యంగా కడప జిల్లా ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులు గురించి, ఫోకస్ పెడతారని ఆశిద్దాం...