ఈ రోజు ఉదయం సాక్షిలో ఒక కధనం వచ్చింది. కేశినేని నాని పార్టీ మారుతున్నారు అంటూ కధనం రాసి, అందులో పెట్టింది ఏమిటి అంటే, కేశినేని భవన్ లో రతన్ టాటా ఫోటో పెట్టారని. చంద్రబాబు ఫోటోలు అన్నీ తీసి వేసారని, ఇంచార్జ్ ల ఫోటోలు అన్నీ తొలగించారు అంటూ, వార్తలు వచ్చాయి. ముఖ్యంగా బ్లూ మీడియా ప్రముఖంగా ఈ కధనాలు ప్రచురించింది. సహజంగానే టిడిపి శ్రేణుల్లో ఈ అంశం కొంత టెన్షన్ కు దారి తీసింది. ఈ మధ్య కాలంలో నెల రోజులు క్రిందట కూడా కేశినేని నాని రాజకీయాలకు గుడ్ బై చెప్పారని, ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని, టిడిపి పార్టీకి కూడా రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు వచ్చిన సందర్భంలో కేశినేని నాని విజయవాడలో లేరు. తిరిగి వచ్చిన తరువాత శ్రేణులతో మాట్లాడుతూ, తాను ఏమి పార్టీ మారటం లేదు అని, రాజకీయ సన్యాసం తీసుకుంటారు అంటూ వస్తున్న వార్తలు ఖండించారు. కొంత మందితో ఇబ్బంది ఉన్న మాట వాస్తవం అని అన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ బ్లూ మీడియాలో కేశినేని నాని పార్టీ మారుతున్నారని, ఢిల్లీలో కేశినేని నాని బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు అంటూ, వార్తలు ఈ రోజు ఊదరగొడుతూ, చంద్రబాబుకు షాక్ అంటూ, బ్లూ మీడియా హడావిడి చేస్తుంది.
అయితే వస్తున్న వార్తల పై కేశినేని భవన్ ఘాటుగా స్పందించింది. మీడియాను కేశినేని భవన్ కు పిలిపించి, అక్కడున్న చంద్రబాబు ఫోటోలు అన్నీ చూపించారు. కేశినేని భవన్లో చంద్రబాబు గారి ఫోటో తొలగించాం అని చెప్పటం అవాస్తవం అని అన్నారు. ఎక్కడైతే కేశినేని నాని కూర్చుంటారో, అక్కడ వెనుక పక్క మత్రమే రతన్ టాటా గారు, కేశినేని నాని గారు కలిసి ఉన్న ఫోటో పెట్టాం అని అన్నారు. కేశినేని భవన్ మొత్తం చంద్రబాబు గారి 50 అడుగుల కట్ అవుట్ తో పెట్టి ఉందని, భవన్ మొత్తం చంద్రబాబు గారి ఫొటోలే ఉన్నాయని అన్నారు. టాటా ట్రస్ట్, విజయవాడ పార్లమెంట్ పరిధిలో చేస్తున్న సేవలకు గుర్తు గానే ఆయన ఫోటో పెట్టామని అన్నారు. పార్లమెంట్ కమిటీ మీటింగ్ కోసం, కేశినేని నాని ఢిల్లీ వెళ్ళారని, ఇది ఎప్పుడూ జరిగే విషయమే అని అన్నారు. బీజేపీ మునిగిపోయే పార్టీ అని, అలాంటి బీజేపీతో కేశినేని నాని చర్చలు జరపటానికి వెళ్లారు అంటూ, బ్లూ మీడియాలో వచ్చిన ప్రచారం పై, కేశినేని కార్యాలయం ఘాటుగా స్పందిస్తూ, బ్లూ మీడియా ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టింది.