ఒక పక్క వైసీపీ, మాకు అధికారం ఉంది, మేమే గెలుస్తాం అంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో హడావిడి చేస్తుంటే, తెలుగుదేశం అంతే ధీటుగా స్పందిస్తుంది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పందిస్తూ, మేము విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నాం, ఎంత మంది మంత్రులు రాజీనామా చేస్తారో రెడీగా ఉండండి అంటూ వైసీపీకి ఛాలెంజ్ చేసారు. కేశినేని మాట్లాడుతూ, "విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలతోనే జగన్ పతనం మొదలవుతుంది. 75 శాతం సీట్లు గెలవబోతున్నాం. ఎంత మంది మంత్రులతో రాజీనామా చెపిస్తాడో చూస్తాం. సీఎం గా జగన్ ఫెయిల్ అయ్యారు. జగన్ స్వార్థం కోసం మూడు రాజధానులు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. కృష్ణా గుంటూరు జిల్లాలు నాశనం అవ్వాలని జగన్ ఎందుకు కోరుకుంటున్నాడు. సీపీఐ టీడీపీ కలిసి పోటీ చేస్తుంది. కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్, విజయవాడ కార్పొరేషన్ గెలుస్తున్నాం. కేసులకు భయపడి..జగన్ బీజేపీ కి అమ్ముడు పోయాడు. 22 మంది ఎంపీలతో caa కి అనుకూలంగా ఓటు వేయించాడు. కేంద్రం మెడలు వంచుతా అని..కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నాడు. రాష్ట్రాన్ని బీజేపీ కి తాకట్టు పెట్టారు. ప్రతి ఒక్కరు జగన్ కి బుద్ధి చెప్పండి...స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ లు టీడీపీ గెలుస్తుంది. నిజంగా ప్రజలు నీ పక్షాన ఉంటే స్వేచ్ఛగా ఎన్నికలు జరపాలి. ఓటమి భయంతో జగన్ అభ్యర్థులపై కేసులు పెట్టిస్తున్నారు" అంటూ కేశినేని నాని వ్యాఖ్యానించారు.

జగన్‌ పాలనలో అన్నీ నల్ల చట్టాలు, నల్ల జీవోలు, బ్లాక్ డేలే నని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియకు, ప్రభుత్వానికి సంబంధమేంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ అనేది ఈసీ పరిధిలోని అంశమన్న ఆయన..66 మండలాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకుండా చేశారని దుయ్యబట్టారు. ఇలాంటి అరాచక పాలన రాష్ట్రంలో గతంలో లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు, ప్రభుత్వానికి సంబంధం ఏంటని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నిలదీశారు. 2020 ఆర్డినెన్స్ 2 ఒక నల్ల చట్టమన్న యనమల.. ఏపీ పంచాయతీరాజ్ చట్ట సవరణలే జగన్ చీకటి పాలనకు నిదర్శనాలన్నారు.

ఏదో వంకచూపి గెలిచిన అభ్యర్ధులపై కక్ష సాధించడానికే ఈ సవరణ చేశారని యనమల ఆరోపించారు. పోటీ చేసేవాళ్లను భయపెట్టడం, ప్రతిపక్షాల అభ్యర్ధులను పోటీకి రాకుండా చేసేందుకే ఈ చీకటి ఆర్డినెన్స్ దొడ్డిదారిన తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆర్డినెన్స్ చెల్లదన్న ఆయన....తెలుగుదేశం పార్టీ దీనిపై న్యాయస్థానంలో సవాల్‌ చేస్తుందన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించాక ఎన్నికలను వాయిదా వేసే అధికారం కలెక్టర్లకు లేదని స్పష్టంచేశారు. 8 జెడ్పీటీసీ, 345 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు ఏ విధంగా వాయిదా వేస్తారని ఆయన ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెదేపా నేతలను వైకాపాలో చేర్చుకుంటున్నారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. ఎంతమందిని తీసుకెళ్లినా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ పాత్ర ఉందని ఆరోపించి... ఇప్పుడు రిలయన్స్‌కు సంబంధించినవారికే రాజ్యసభ సీటు ఎలా ఇచ్చారని అశోక్‌బాబు ప్రశ్నించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read