మనం నిన్న అవిశ్వాసం పెట్టింది ఎందుకు ? ఆంధ్ర రాష్ట్ర సమస్యల పై.. అవేమీ పట్టించుకోకుండా, రాహుల్ గాంధీ పై వెకిలి కామెంట్లు, వెకిలి యాక్షన్ లతో, ప్రధాని రెండు గంటలు రక్తి కట్టించారు. మనం 18 విభజన అంశాల పై ఏమి చేసారు అని అడిగితే, తెలుగు మా తల్లి, చంద్రబాబు మా స్నేహితుడు అంటూ, డ్రామా పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ప్రధాని ప్రసంగం ముగియగానే, కేశినేని నాని లాస్ట్ పంచ్ ఇచ్చారు. అప్పటికే, గల్లా, రామ్మోహన్ నాయుడు వాయింపుడుతో ఉన్న బీజేపీ వాళ్లకి, చివర్లో బెజవాడ మోటార్ ఫీల్డ్ భాషాలో, కేశినేని నాని ఇచ్చిన లాస్ట్ పంచ్ తో, ఫీజులు ఎగిరిపోయాయి. మన సమస్యల పై స్పందించకుండా, రెండు గంటలు అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చిన మోడీకి, లాస్ట్ పంచ్ అదరగొట్టారు నాని.

kesineni 21072018 2

తెలుగును తల్లిగా సంబోధించిన ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు ఆ తల్లినే చంపేయడానికి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. మోదీ ప్రసంగం బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీని తలపించిందన్నారు. ప్రపంచంలోనే ఉత్తమ నటుడని విమర్శించారు. ప్రధాని ప్రసంగ నైపుణ్యం ఆకట్టుకుందని.. అయితే ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. 2014కి ముందు కూడా అబద్ధపు హామీలిచ్చారని విమర్శించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోందని దుయ్యబట్టారు. ఆయన మాటల్లో ఏపీకి న్యాయం చేస్తామన్న మాట ఎక్కడా లేదన్నారు కేశినేని. 2014 ఎన్నికలకు ముందు కూడా ఇలాగే ఎన్నో వాగ్దానాలు చేసి ప్రజలను మోసగించారన్నారు. అమలును విస్మరించారన్నారు.

kesineni 21072018 3

‘‘ప్రధానమంత్రి ఎంతో అద్భుత ప్రసంగం చేశారు. హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా రామాయణం నుంచి చరిత్రనంతా ఆవిష్కరించారు. నాడు అశాస్త్రీయంగా ఏపీ విభజన జరిగింది. ఈ సభలో అధికార విపక్ష పార్టీల స్థానాలు మారినా ఆరోజు విభజనకు ఇద్దరూ బాధ్యులే. ఆ విషయాన్ని అంగీకరించినందుకు ఎంపీ హరిబాబును అభినందిస్తున్నా. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీవీ బంద్‌ చేసి విభజన చేశారు. మా సహచరుడు కొనకళ్ల నారాయణను కొట్టారు. దానికీ రెండు పార్టీలూ బాధ్యులే. పిడిగుద్దులకు నారాయణ కుప్పకూలిపోతే విమానంలో ముంబయి ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది. అప్పట్లో ఈ సభలోని ప్రభుత్వానికి మెజార్టీలేదు. 14 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసి బిల్లు ఆమోదించారు. ఆనాటి విభజనకు ఎలాంటి ప్రాతిపదికా లేదు. మీరు(ప్రధాని) గొప్ప నటులు, డ్రామా ఆర్టిస్ట్‌. దాన్ని అంగీకరిస్తున్నా. మీ ఒకటిన్నర గంటల ప్రసంగం వింటున్నప్పుడు బ్లాక్‌బస్టర్‌ సినిమా చూస్తూ కూర్చున్నట్టు అనిపించింది’’ అని ధ్వజమెత్తారు. అయితే కేశినేని నాని వ్యాఖ్యలకు మన రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే, మోడీ పెద్ద యాక్టర్ అని అందరికీ తెలుసు. కాని, మోడీ మొఖం మీదే ఆ మాట చెప్పటంతో, అందరూ మా మనుసులో మాటే చెప్పారు అంటూ , అభినందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read