లోకసభలో మరోసారి జగన్ మెడలు వంచుడు కార్యక్రమం బట్టబయలు అయ్యింది. ఈ రోజు లోకసభలో ఏపీకి ప్రత్యేక హోదా లేదని పరోక్షంగా కేంద్రం తేల్చి చెప్పింది. 14, 15 ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాలకు నిధులు అందిస్తున్నామన్న కేంద్రం చెప్పింది. ఇక ప్రత్యేక హోదా సహా ఏపీకి సంబంధించిన అంశాలపై పార్లమెంటులో టీడీపీ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. వివిధ అంశాలపై టీడీపీ ఎంపీలు సభలో ప్రస్తావించగా, జగన్ భాగోతం మొత్తం బయట అపడింది. లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ కు సంబందించిన ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రస్తావించారు. విభజన చట్టంలోని హామీల అమలుపై రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ లేవనెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయా అని కేంద్రాన్ని కేశినేని నాని ప్రశ్నించారు. విభజన కారణంగా ఏపీ ఆర్థికంగా చాలా నష్టపోయిందన్న కేశినేని నాని, హోదా అంశాన్ని లేవనెత్తారు.
విభజన నష్టాన్ని పూరించేందుకు తీసుకున్న చర్యలపై కేంద్రాన్ని కేశినేని నాని ప్రశ్నించారు. విభజన హామీలు నెరవేర్చేందుకు సాయం చేస్తున్నారా అని ఎంపీ కనకమేడల కేంద్రాన్ని ప్రశ్నించ్గారి, హామీల అమలు కోసం అందిస్తున్న నిధుల వివరాలపై ఎంపీ కనకమేడల కేంద్రాన్ని ప్రశ్నించారు. అయితే దీని పై కేంద్రం పాత పాడే పాడింది. కేంద్రాన్ని మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అని చెప్పిన వైసీపీ ఎంపీలు, కనీసం చిన్న చిన్న పనులు కూడా చేయటం లేదు. కనీసం నిరసన కూడా తెలపటం లేదు. దాదాపుగా రెండు సభల్లో 28 మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై కేంద్రాన్ని కనీసం ప్రశ్నించటం లేదు. మరో ఏడాదిలో విభజన బిల్లు గడువు కూడా ముగిసిపోతుంది. ఈ తరుణంలోనే టిడిపి ఎంపీలు, కేంద్రాన్ని నిలదీస్తున్నారు. వైసీపీ ఎంపీలు మత్రం, ఎందుకో మరి, ఈ అంశాల పై నిలదీయటానికి భయ పడుతున్నారు. ప్లీజ్ సార్ ప్లీజ్ అనటం వరుకే మనం చేయగలిగింది అని ఇప్పటికే జగన్ గారు చెప్పిన విషయం తెలిసిందే.