ప్రతి రోజు ఎదో ఒక ట్వీట్ చేసి, వార్తల్లో నిలిచే కేశినేని నాని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజేపీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు. రాష్ట్రంలో కాల్ మనీ వ్యవహారం తారా స్థాయిలో ఉందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం ఈ మధ్య వార్తలో చూస్తున్నామని, ఈ సమస్య అందరికంటే ఎక్కువగా మీకే తెలుసనీ, దీని పై ఆక్షన్ తీసుకోండి అంటూ, ఒక పేపర్ కటింగ్ జత చేసి కేశినేని నాని ట్వీట్ చేసారు. కాల్ మొనీ మాఫియా నుంచి ప్రజలను కాపాడాలని కేశినేని నాని కోరారు. అయితే ఈ ట్వీట్ ని కూడా బుద్దా వెంకన్నను పరోక్షంగా టార్గెట్ చేసినట్టు అర్ధమవుతుంది. తెలుగుదేశం హయంలో, అప్పట్లో విజయవాడలో కాల్ మనీ కలకలం రేగిన సంగతి తెలిసిందే. అప్పట్లో బుద్దా వెంకన్న పై కూడా వైసిపీ తీవ్ర విమర్శలు చేసింది. ఈ నేపధ్యంలో, కేశినేని నాని, కావాలనే టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది.
విజయవాడలో కాల్ మనీ కేసులు వెలుగు చూసిన సమయంలో, ప్రసుత్తం డీజీపీగా ఉన్న గౌతం సవాంగ్, అప్పట్లో విజయవాడ సిపీగా పని చేసారు. తరువాత కాల్ మొనీ కేసులు తగ్గుతూ వచ్చాయి. అయితే కేశినేని ఎవరినీ టార్గెట్ చేసుకుని ఈ ట్వీట్ చేసినా, మళ్ళీ ఈ కాల్ మనీ వ్యవహారం అధికమైంది. రాష్ట్రంలో ప్రతి రోజు ఈ కాల్ మనీ వేధింపులకు సంబంధించి కేసులు ఎక్కవ అయ్యాయి. ఏకంగా పులివెందుల మాఫియా నుంచి నాకు రక్షణ కావలి అని, ఒక మాజీ ఎమ్మెల్యే, కడప ఎస్పీకి మోర పెట్టుకున్నారు అంటే తీవ్రత అర్ధమావుతుంది. వైఎస్ఆర్ కు అత్యంత ఆప్తుడు అయిన కదిరి మాజీ ఎమ్మెల్యే జొన్నరామయ్య, నన్ను పులివెందుల మాఫియా బెదిరిస్తుందని, అప్పు తీర్చేసినా, ఇంకా ఇంకా తెమ్మని బెదిరిస్తున్నారని, ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు.
నిజానికి వీరి అరాచకం తట్టుకోలేక , కదిరి మాజీ ఎమ్మెల్యే జొన్నరామయ్య ఆత్మహత్య ప్రయత్నం చేసారు. రామయ్య ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న కుటుంబ సభ్యులు ఆయనతో కలిసి ఎస్పీని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే, ఇలాంటి వార్తలు రోజు రోజుకీ ఎక్కువ అయిపోతున్నాయి. ఈ రోజు కేశినేని నాని, అనంతపురంలో జరిగిన విషయం ప్రస్తావిస్తూ, కాల్ మనీ బారి నుంచి కాపాడాలని కోరారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి, ఈ కాల్ మనీ వ్యవహారం ఒక మచ్చగా మిగిలింది. ఇది వెలుగులోకి వచ్చిన తరువాత, వారిని కట్టడి చేసినా, ఆ మచ్చ మాత్రం అలాగే ఉండి పోయింది. అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం రాగానే, మళ్ళీ ఎక్కడికక్కడ, ఈ కాల్ మనీ మాఫియా రెచ్చిపోతుంది. జగన కనుక వీటిని కంట్రోల్ చెయ్యకపోతే, ఆయనకు ప్రభుత్వానికి కూడా అపవాదులు తప్పవు.