కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ల మధ్య కొనసాగుతుంది. రెండు రోజుల క్రితం వచ్చిన ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సాధించింది. అయితే ఇది అనేక ట్విస్ట్ లు తిరుగుతుంది. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉన్నాయి. ఈ 29 వార్డుల్లో, టిడిపి పార్టీ 14 వార్డులు గెలుచుకుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 వార్డులు గెలుచుకుంది. అయితే మరో ఇండిపెన్డెంట్ అభ్యర్ధి కూడా గెలుచున్నారుఇండిపెన్డెంట్ అభ్యర్ధి చంద్రబాబు గారి సమక్షంలో టిడిపిలో చేరటంతో టీడీపీ బలం 15కు చేరుకుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ ఎక్స్ అఫీషియో ఓటు ఉండటంతో, ఆయన తన ఓటు వినియోగించుకోవటంతో, వైసీపీ బలం కూడా 15కు చేరుకుంది. అయితే ఇదే సందర్భంలో అక్కడ స్థానిక ఎంపీగా ఉన్న టిడిపి విజయవాడ ఎంపీ కేశినేని నానికి కూడా అక్కడ ఓటు ఉంది. అయితే ఆయన ఓటు నమోదు చేసుకోలేదు. ముందుగా నమోదు చేసుకోక పోవటంతో, కేశినేని నాని ఓటు పై సస్పెన్స్ నెలకొంది. ఈ నెల 22న కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఉండటం, ఏమి జరుగుతుందా అని అందరూ టెన్షన్ పడుతున్న సందర్భంలో, కేశినేని నానికి ఓటు లేదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం హ్సుస్తూ, మైండ్ గేం ఆడింది.
అయితే కేశినేని నాని మాత్రం, ఓటు హక్కు ఎప్పుడైనా కౌంటింగ్ జరిగే రోజు వరకు అడగవచ్చని చెప్పారు. ఎక్స్ అఫిషియో సభ్యుడిగా తనకు ఓటు వేసే హక్కుని ఇవ్వాలి అంటూ, మున్సిపల్ కమిషనర్ కు కేశినేని నాని, అదే రోజు లేఖ రాసారు. అయితే మున్సిపల్ కమిషనర్ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అప్పటికే ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు సాయంత్రం 5 గంటలలోపు అయిపొయింది. మున్సిపల్ కమిషనర్ మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మున్సిపల్ కమిషనర్ సమాధానం ఇవ్వకపోవటంతో, ఆయన కావాలనే కాలయాపన చేసారు అంటూ, కేశినేని నాని హైకోర్టుకు వెళ్లి వైసీపీకి షాక్ ఇచ్చారు. దీంతో కోర్టు, కొండపల్లిలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా, ఓటు వేసేందుకు కేశినేనికి అనుమతి ఇచ్చింది. ఈ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ కు జారీ చేసింది. అయితే ఫలితాలు మాత్రం ప్రకటించవద్దని, విచారణాను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు చెప్పింది. మరో పక్క టిడిపి వారిని లాగేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని, టిడిపి ఆరోపిస్తుంది.