విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడేది చాలా తక్కువ.. కాని మాట్లాడితే మాత్రం, ఎక్కడ పంచ్ పడాలో అక్కడ పడుతుంది... అవిశ్వాస తీర్మానం సమయంలో, బెజవాడ మోటార్ ఫీల్డ్ భాషాలో, కేశినేని నాని ఇచ్చిన లాస్ట్ పంచ్ తో, ఫీజులు ఎగిరిపోయాయి. వాట్ ఏ ఆక్షన్ అంటూ మోడీ చేసిన రాజకీయ ఉపన్యాసం తుస్సు మంది. అయితే, ఈ రోజు కూడా నాని, అదే రకమైన పంచ్ వేసారు. జీవీఎల్ నరసింహారావు ఉన్నట్టు ఉండి ఊడిపడి, ఈ రోజు రాష్త్రం పై చేస్తున్న ఆరోపణలు వింటున్నాం. రూ.53 వేల కోట్లను పర్సనల్ అకౌంట్స్‌లో వేశారని, పీడీ స్కాంలో చంద్రబాబు దొరికిపోయారని, కామన్వెల్త్ , 2జీ స్కాంల కంటే పీడీ కుంభకోణం పెద్దదని, తెగ హడావిడి చేస్తున్నాడు జీవీఎల్.
దీంతో కేశినేని నాని, జీవీఎల్ నరసింహారావు పై, బెజవాడ స్టైల్ పంచ్ వేసారు. నరసింహరావుకు ఏపీలో అడ్రస్ లేదని, ఆయన అడ్రస్ ఒకచోట.. మాట్లాడేది మరోచోట అంటూ పంచ్ పేల్చారు. జీవీఎల్, C/O ఢిల్లీ ఆధర్ కార్డు అంటూ ఎద్దేవాచేశారు. ఢిల్లీ ఆధర్ కార్డు పెట్టుకుని, మన దగ్గరకు వచ్చి, ఎదో అయిపొయింది అంటూ హడావిడి చేస్తున్నారని అన్నారు. జీవీఎల్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లక్ష కోట్ల అవినీతి అంటున్న జీవీఎల్, వెయ్యి రూపాయల అవినీతి జరిగిందని నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు. నీకు డైరెక్ట్ సవాల్, లక్ష కోట్లు అవసరం లేదు, వెయ్య రూపాయలు అవినీతి చూపించు అంటూ జీవీఎల్ కు గట్టి పంచ్ ఇచ్చారు నాని. రాష్ట్రానికి హోదా కోసం పోరాటం చేస్తుంటే పార్లమెంట్‌కి ముప్పు వస్తుందని జీవీఎల్ అనడం దారుణమని నాని అన్నారు.
మరో పక్క, ఇప్పటికే ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా జీవీఎల్ కు జ్ఞానోదయం చేసారు. జీవీఎల్ కు ప్రజా ఆర్థిక వ్యవహారాలపై అవగాహన లేదని, రేపు విజయవాడకు వస్తే అవగాహన కల్పిస్తామని కుటుంబరావు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… పీడీ అకౌంట్ నుంచి నిధులు మళ్లాయని జీవీఎల్ చేసిన ఆరోపణలు రుజువు చేయాలన్నారు. పీడీ అకౌంట్ నుంచి నిధులు మళ్లాయని రుజువు చేస్తే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్దమన్నారు. జీవీఎల్ చేసిన ఆరోపణల వల్ల లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను కించపరిచారన్నారు. పీడీ అకౌంట్‌లో రూ.20 వేల కోట్లు మురిగిపోతున్నాయంటూ.. జీవీఎల్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. నిధులే ఉంటే రాష్ట్రం ఎందుకు అప్పులు చేస్తుందని కుటుంబరావు ప్రశ్నించారు. ప్రభుత్వం నిధుల దుర్వినియోగం చేస్తుందని అనుమానం ఉంటే ఏపీ ప్రభుత్వ ఖాతాలు సరిగ్గా లేవనీ సీబీసీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.