ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న హాట్ టాపిక్, ప్రజా వేదిక విధ్వంసం.. దీని పై అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరి వాదన వారిదైనా, ఎక్కువ మంది మాత్రం, ఇలా భవనాలు కూల్చటం ఏంటి, ఎదో ఒక దానికి ఉపయోగించ వచ్చు కదా అనే అభిప్రయంతో ఉన్నారు. అయినా జగన్ గారు నిర్ణయం తీసుకుంటే, ఇక విధ్వంసం ఆగే పరిస్థితి ఉండదు. ఇక ప్రజా వేదిక విధ్వంసం పై తనదైన శైలిలో స్పందించారు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని. ఈ మధ్య ఫేస్బుక్ ద్వారా తన అభిప్రాయలు చెప్తూ, పార్టీలోనే నాయకుల వైఖరినే ప్రశ్నించిన కేశినేని నాని, ఇప్పుడు జగన్ నిర్ణయాలను కూడా ప్రశ్నిస్తున్నారు. నిన్న ప్రజా వేదిక కూల్చకండి, ప్రస్తుతానికి వాడుకుని, కొత్తది కట్టిన తరువాత తీసెయ్యండి అని సలహా ఇచ్చారు కేశినేని. ముందుగా మిగతా కట్టడాలు కూల్చండి, ఈ లోపు ప్రజా వేదికను వాడుకుంటూ, కొత్తది కట్టండి, అప్పుడు ప్రైవేటు హాల్స్ లో మీటింగ్ లు పెట్టుకునే అవసరం ఉండదు, డబ్బులు మిగిలుతాయి అని సలహా ఇచ్చారు. ఈ రోజు మాత్రం జగన్ తీసుకున్న నిర్ణయం పై వెటకారంగా పోస్ట్ పెట్టారు.
ప్రజా వేదిక కూల్చివేత పై కేశినేని నాని ఫేస్బుక్ లో స్పందిస్తూ, ‘‘ఇంకా నయం, తాజ్‌మహల్ ఎక్కడో ఆగ్రాలోని యమునా నది తీరాన ఉంది కాబట్టి సరిపోయింది. అదే తాజ్‌మహల్ మన రాష్ట్రంలోని కృష్ణా నది తీరాన కత్తి ఉంటే ప్రజావేదికలా నేల మట్టం అయ్యేది’’ అని పోస్ట్ పెట్టారు. దీనికి అనుబంధంగా ఒక పక్క తాజ్ మహల్, మరో పక్క కూల్చివేసిన ప్రజావేదిక ఫొటోలను పెట్టి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు కేశినేని నాని. ఎవరు ఎన్ని చెప్పినా, బంగారం లాంటి బిల్డింగ్ , ఒక్క రాత్రిలో నాశనం చేసేసారు. అందుకే అంటారు ఒక కట్టడం కట్టాలి అంటే చాలా కష్టం, దాన్ని పడేయాలి అంటే చాలా తేలిక అని. అయినా ఎవరు చెప్పినా, వినే పరిస్థితిలో జగన్ మాత్రం లేరు. చంద్రబాబు ఏమైనా కట్టారు అంటే దాన్ని కూల్చి వెయ్యటమే...