కియా కార్ల పరిశ్రమకు సంబంధించి ట్రైనింగ్ సెంటర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా, పెనుకొండ మండలంలోని అమ్మవారిపల్లి సమీపాన కియా కార్ల పరిశ్రమ పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కియాలో ఉద్యోగ నియామకాల విషయమై కియా ఎండీ జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఇటీవలే మాట్లాడిన విషయం విదితమే. దీంతో నియామకాలకు చర్యలు చేపడుతున్నట్లు అర్థమవుతోంది. ఉద్యోగుల ఎంపిక అనంతరం వారికి కంపెనీ అవసరాలనుగుణంగా శిక్షణ ఇవ్వాలని యాజమాన్యం భావిస్తోంది. ఆ దిశగా దుద్దేబండ సమీపాన ట్రైనింగ్ సెంటర్ నిర్మాణం చేపట్టింది. పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కియా ఉద్యోగాలు కోసం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు http://www.kia-motors.in/web/html/india/Careers.jsp
అలాగే పెనుకొండలో నిన్నమొన్నటి దాకా భోజనం చేద్దామంటే మంచి హోటల్ కనిపించేది కాదు. ఇప్పుడు ఏకంగా విదేశీ రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ఒక ట్రెండు కాదు... పట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నాయి. అంతా కియా మహిమ... దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియా తన ప్లాంట్ పట్టణ సమీపంలో ఏర్పాటు చేస్తుండటంతో పెనుకొండ ముఖ చిత్రం మారిపోతోంది... దక్షిణ కొరియాకు చెందిన 150 మంది వివిధ పనులు చేపట్టేందుకు పెనుకొండ వచ్చారు. కియాకు అనుబంధంగా కొటాక్, హుందయ్ ప్లాంట్లు నిర్మిస్తున్నారు. వీరి కోసం పెనుకొండలో పలు కొరియన్ రెస్టారంట్లు వెలుస్తున్నాయి.
యాహూన్, కన్గమ్ ఇప్పటికే వండి వారుస్తున్నాయి. మరో నాలుగు రెస్టారంట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. బెంగుళూరులో ఉన్న కొరియన్ రెస్టారంట్ల నిర్వాహకులు పెనుకొండలో బ్రాంచ్ల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఈ రెసారెంట్లలో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాలు అందుబాటులో ఉంచారు. కొరియన్ వంటకాలు రూ.350 ప్రారంభం నుంచి రూ.1550 దాకా ధరలు పెట్టారు. కొరియన్ రైస్ రూ.350, బీఫ్ రూ.600 నుంచి రూ.900 వరకు, సూప్, చికెన్, నూడుల్స్ కొరియన్ నూడుల్స్ వీటికి తోడూ 9 రకాల చేపలు వండుతున్నారు. ఆహారానికి ఒక్కో కొరియన్ రోజుకు సగటున రూ.వెయ్యి పైనే ఖర్చు చేస్తున్నాడు. అనంతపురం, బెంగళూరు, పుట్టపర్తి ప్రాంతాల్లో ఉంటున్న కొంతమంది కొరియన్లకు రోజువారీగా వాహనాల్లో ఆహారాన్ని పార్మిల్ పంపుతున్నారు.