రాయలసీమ పారిశ్రామిక ముఖచిత్రాన్ని మార్చేది... నవ్యాంధ్రలోనే అతిపెద్ద ఆటోమొబైల్‌ పరిశ్రమ ! ‘కియ’ కార్ల కంపెనీ ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో... యర్రమంచి గ్రామం వద్ద, జాతీయ రహదారి పక్కనే ‘కియ’ ప్లాంటు ఏర్పాటవుతోంది. మరొక్క ఏడాదిలోనే కియ ప్లాంటు నుంచి మొదటి కారు రోడ్డెక్కనుంది. పరిశ్రమ ఉత్పత్తి సమయానికి అవసరమైన సిబ్బంది, కార్మికుల కోసం ఉద్యోగాల నియామక ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే కియ కార్ల ఉత్పత్తికి సన్నాహాలు చేస్తుండగా.. తొలిగా 20 మంది డిప్లమో పూర్తి చేసిన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నారు. దశలవారీగా ఈ నియామకాలు కొనసాగుతూనే ఉంటాయని కియ ప్రతినిధులు చెబుతున్నారు. కియ కార్లపరిశ్రమలో ప్రాథమిక, సాంకేతిక కోర్సులో శిక్షణ ప్రారంభమైంది.

kia 02072018 2

మరో పక్క, కియాలో ఉద్యోగాల కోసం వచ్చిన ధరఖాస్తులు చూసి, కియా కంపెనీనే ఆశ్చర్యపోయింది. పరిశ్రమలో ఉద్యోగ నియామకాల కోసం 5400 మంది డిప్లమో అభ్యర్థులు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేసుకున్నారని విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. అయితే, వీరిలో నుంచి ముందుగా 290 మందికి అర్హత పరీక్షలు నిర్వహించారు. పరిశ్రమ సమీపంలోని దుద్దేబండ క్రాస్‌ వద్ద 11 ఎకరాల్లో కియ మోటార్‌ ఇండియా శిక్షణ కేంద్రాన్ని ఈ నెల 20న ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ తొలి బ్యాచ్‌ అభ్యర్థులకు శిక్షణా తరగతులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అందులో 20 విభాగాల పనితీరుకు సంబంధించి శిక్షణ ఇస్తున్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల్లో 20 మందికి ఐదేసి రోజుల చొప్పున శిక్షణ ఇస్తున్నారు.

kia 02072018 3

ఈ శిక్షణలో నైపుణ్యం కనబరచిన 600 మంది అభ్యర్థులను మెయిన్‌ ప్లాంట్‌కు, మిగిలిన వారిని వివిధ విభాగాల్లో పనికి నియమిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కియ పరిశ్రమ ఒప్పందం ప్రకారం 11 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలిదశలో అనంతపురం జిల్లా వాసులు 2వేల మందికి మొదట పెనుకొండలో శిక్షణ పూర్తి చేస్తారు. డిప్లమో పూర్తి చేసిన వారికి మొదట ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆటో మొబైల్‌ పరిశ్రమ కోసం ప్రాథమిక, సాంకేతిక కోర్సు శిక్షణలో అత్యత్తమమైన ప్రతిభ కనపరిచిన అభ్యర్థులకు కియ ప్రధాన ప్లాంటులో నియమించనున్నారు. పరిశ్రమ నిర్మాణ పనులు పూర్తయితే ప్రత్యక్షంగా 4 వేలు, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభించనుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read