ప్రతి జిల్లాలో ఒక భారీ ప్రాజెక్ట్ ఉండాలనే ఉద్దేశంతో, చంద్రబాబు సియం అయిన వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ దశలో చంద్రబాబు కొరియా పర్యటన సందర్భంగా కియా మోటార్స్ తో సమావేశం అయ్యి, వారు భారత దేశంలో పెట్టుబడులు పెట్టటానికి రెడీగా ఉన్నారు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా అన్ని విధాలుగా అనువుగా ఉంటుందని, అందుకని అక్కడ పరిశ్రమ పెట్టాలని కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం, గుజరాత, తమిళనాడు ప్రభుత్వాలు, కియా కంపెనీ కోసం పోటీ పడగా, చివరకు చంద్రబాబు కియా కంపెనీని ఒప్పించి అనంతపురం జిల్లా పెనుకొండలో పెట్టించారు. కియా తరువాత, అనేక అనుభంద సంస్థలు కూడా అక్కడకు వచ్చాయి. అక్కడ ఏకంగా ఒక కొరియా టౌన్షిప్ తాయారు అయ్యే పరిస్థితి వచ్చింది. మరో నెల రెండు నెలల్లో, అనంతపురం కియా కంపెనీ ప్లాంట్ నుంచి మొదటి కారు బయటకు రానుంది కూడా.

అయితే కియా దేశంలోనే అతి పెద్ద విదేశీ పెట్టుబడి కావటంతో, దాని క్రెడిట్ చంద్రబాబుకి ఇవ్వటం ఇష్టం లేక, కియా కంపెనీ కేవలం మోడి వల్లే వచ్చింది అంటూ ప్రచారం చేసుకున్నారు. అయితే, కియా మోడీ తెచ్చాడో, చంద్రబాబు తెచ్చాడో అని ప్రజలు ఇప్పటికే కన్ఫ్యూషన్ లో ఉంటే, ఇప్పుడు మరో ఊహించని షాక్ ఇచ్చింది వైసిపీ ప్రభుత్వం. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ, కియా కంపెనీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల వచ్చింది అంటూ, అసెంబ్లీలో ప్రకటన చేసింది. దానికి ఒక లెటర్ చూపిస్తూ, కియా కంపెనీ ప్రెసిడెంట్ మాకు లెటర్ రాసారని, 2007లోనే రాజశేఖర్ రెడ్డి కియా కంపెనీని ఆంధ్రప్రదేశ్ లో పెట్టమని కోరారని, దాని ప్రకారమే మేము ఏపిలో పెట్టుబడి పెట్టమని చెప్పనట్టు, బుగ్గన చదివి వినిపించారు. ఎప్పుడో 2007లో వైఎస్ఆర్ కోరితే, ఆయన కోరికే ప్రకారమే, ఈ రోజు కియా కంపెనీ ఏపిలో పెట్టుబడి పెట్టింది అంట. మరి ఏపికి రాక ముందు మహారాష్ట్ర, గుజరాత్ తో ఎందుకు పోటీ పడ్డారో ? మొన్న ఎన్నికల సమయంలో కూడా జగన్ మోహన్ రెడ్డి,కియా కంపెనీ మోడీ వాల్లే వచ్చింది అని ఎందుకు చెప్పారో. పాపం, అప్పటికి జగన్ గారికి, ఈ ఉత్తరం అంది ఉండదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read