బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ ప్రభుత్వం వ్యతిరేకమని ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడతూ… గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సభలు పెట్టి గిరిజనులను రెచ్చగొట్టడం సరికాదని ఏపీ మంత్రి కిడారి శ్రవణ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేయాలని, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి కిడారి ఆదేశించారు. గిరిజన విద్యార్ధుల కోసం స్కిల్ డెవలప్మెంట్, జాబు మేళాలు పెట్టమని చెప్పూర్. గిరిజనుల సంక్షేమం కోసం క్రృషి చేస్తున్న మా ప్రభుత్వంపై పవన్..తన స్వార్థం కోసం గిరిజనులను రెచ్చగొడ్తున్నారు అని మంత్రి కిడారి శ్రవణ్ ఆరోపించారు.
నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కిడారి, సోమ చనిపోవడానికి చంద్రబాబే కారణం అని పాడేరు సభలో పవన్ కల్యాణ్ ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, గిరిజనులని చంద్రబాబు పట్టించుకోవటం లేదని, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే గిరిజన సమస్యలు లేకుండా చేస్తానని అన్నారు. బాక్సైట్ తవ్వకాలను ప్రోత్సహించి, కిడారి, సోమ, హత్య కాబడటానికి చంద్రబాబు కారణం అయ్యారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గిరిజనులకు సరైన సౌకర్యాలు లేవని, జీవితం మీద విరక్తితో వీరు మావోలుగా మారిపోతున్నారు అంటూ, పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. గిరిజనులకు ఎంతో చేస్తున్నా, ఏమి చెయ్యటం లేదు అంటూ, ఆరోపణలు చేసారు.
బాక్సయిట్ మైనింగ్ పై ఎలాంటి పోరాటం మనం చేశామో, ఏ విధంగా ఎండ గట్టుపై నిల్చొని మైనింగ్ అడ్డుకునేలా పోరాటం చేశామో అందరికి తెలుసు,మన మన్యం ప్రాంతంలో మైనింగ్ జరగకుండా చేయడానికి పోరాడుతూనే ఉన్నామని..పర్యావరణాన్ని రక్షించాలి అనే ఆశయంతో వచ్చిన జనసేనాని ఈ పోరాటానికి మద్దతుగా నిలిచి, అవసరమైతే ఆ ప్రాంతానికి వెళ్లి ధర్నా చేద్దాం తప్పించి అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు అని చెప్పారు.గిరిజన ప్రాంత ప్రజలకు రక్షిత మంచినీటి పధకం, సరైన రహదారులు కల్పించి అటవీ హక్కుల ద్వారా లభించే ప్రయోజనాలు ప్రతీ గిరిజనుడికి అందించాల్సిన బాధ్యత ఉందన్నారు.