ఆదివారం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే సోమల హత్య అనంతరం పారిపోతున్న మావోయిస్టుల వీడియోలు బయటపడ్డాయి. హత్య చేశాకా వారు పారిపోతున్న దృశ్యాలను స్థానికులు తమ సెల్‌ఫోన్ కెమెరాల్లో బంధించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కామేశ్వరి అలియాస్ సింద్రి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జలుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనోగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే కిడారి, సోమాలను హత్య చేసిన మావోల ఫోటోలను పోలీసులు సోమవారం విడుదల చేశారు. వీరిలో జలుమూరు శ్రీనుబాబు అలియాస్ సునీల్ అలియాస్ రైనో, కామేశ్వరి అలియాస్ స్వరూపా అలియాస్ సింద్రి, అలియాస్ చంద్రి, అలియాస్ రింకి, వెంకట రవి చైతన్య అలియాస్ అరుణలుగా గుర్తించారు. ఇక హత్యలో పాల్గొని పారిపోతున్న వారిలో కామేశ్వరి, శ్రీనుబాబులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక్కడ ఆ వీడియో చూడవచ్చు https://youtu.be/zazoG6irrOY

kidari 25092018

ఇక కిడారి సర్వేశ్వరరావు, సోమాలను హతమార్చేందుకు గత ఐదునెలలుగా మావోలు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు అరకు ప్రాంతాన్ని పోలీసులు భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. ఓ వైపు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతుండగా మరోవైపు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ నిర్వహించిన సమయంలో కొందరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రజాప్రతినిధులే టార్గెట్‌గా పైపు లైన్లలో భారీ పేలుడు సామగ్రిని అమర్చారు మావోయిస్టులు. ఇక కిడారి,సోమల హత్యతో మన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మొత్తానికి అటు మావోల కదలికలు, ఇటు పోలీసులు కూంబింగ్‌తో మన్యం ప్రాంతాలు యుద్ధభూమిని తలపిస్తున్నాయి. స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టకుని ఏక్షణం ఏమి జరుగుతుందో తెలియక బిక్కుబిక్కున కాలం వెల్లదీస్తున్నారు.

kidari 25092018

గూడ్ గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న లిప్పిటిపుట్టు దాడికి అన్ని విధాల సురక్షితమని భావించిన మావోయస్టులు అక్కడే యాక్షన్‌కు దిగారు. సెల్ సిగ్నల్స్ పనిచేయని ఈ గ్రామంలో ఇన్ఫార్మర్లను అడుగడుగునా మోహరించారు. స్థానిక మహిళలతో కలిసి దళాలకు అనుగుణంగా ఉన్నవారిని రంగంలోకి దించి కిడారి, సివేరి వాహనాలను ఆపారు. సమస్యలు చెప్పుకోడానికి వచ్చారేమోనని కిడారి భావించారు. అయితే మహిళల్లో కొందరు ఆయుధాలు ధరించి ఉండడాన్ని గమనించిన డ్రైవర్లు తమ వాహనాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే సాయుధులైన మహిళలు కార్లకు అడ్డంగా నిలుచుని తప్పించుకోకుండా చేశారు. తర్వాత కిడారి, సోమను కిందికి దించి యాక్షన్ పూర్తి చేశారు. అరకు ఏజెన్సీలో ఆదివారం (23వ తేదీ) ఉదయం ఈ ఘటన జరిగిన విషయం తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read