సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, ఏది నిజమో, ఏది అబద్ధమో నమ్మలేని పరిస్థితి. అయితే ఇప్పుడు మీడియా, పపెర్లు కూడా ఇలాగే తయారయ్యాయి. ఎదో వార్తా, మాకు వచ్చిన సమాచారం ఇది అని చెప్పటం, ప్రజల మీదకు వదిలెయ్యటం, ప్రజలు అదే నిజం అని, సోషల్ మీడియాలో తిప్పటం. ఇవన్నీ సాధారణంగా జరిగే విషయాలు. ఇక్కడ ఎవరినీ తప్పు బట్టటానికి కూడా లేదు. ప్రజలు అలా ఉన్నారు, మీడియా కూడా అలాగే ఉంది. అందుకే ఆరోగ్య విషయంలో కూడా, ఎవరో ఎదో చెప్తే, అదే నిజం అనుకుని, మెడికల్ ఎక్స్పర్ట్ ఎవరూ చెప్పకపోయినా, గుడ్డిగా ఫాలో అయిపోతూ ఉంటాం. అది నిజంగా మంచి జరుగుతుందా, ఏమన్నా ఇబ్బందులు ఉంటాయా అనే సోయ కూడా ఉండదు. మన బలహీనతే, మీడియా సంస్థలకు పెట్టుబడి అన్నట్టు ఉంది పరిస్థితి.

narasimhan 25012019

ఇక రాజకీయాలు, సినిమాల విషయాలకు వస్తే, ఈ పుకార్లకు అడ్డే ఉండదు. తాజగా ఇలాంటి అతి పెద్ద వైరల్ స్టొరీ, కిరణ్ బేడీ ఏపి గవర్నర్ గా వస్తున్నారని. ఎప్పటి నుంచో, కిరణ్ బేడీ మన రాష్ట్రానికి గవర్నర్ గా వస్తారంటు వార్తాలు వస్తున్నా, అది వాస్తవ రూపం దాల్చలేదు. అయితే ఏమైందో ఏమో కాని, ఒక వారం రోజుల క్రితం, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ వార్తా రావటం, రెండు రోజుల క్రితం నుంచి, బ్రేకింగ్ న్యూస్, కిరణ్ బేడీ ఏపి గవర్నర్ అంటూ, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్స్ అప్ లలో, ఇదే ట్రేండింగ్ వార్తా అయ్యింది. చాలా మంది ప్రజలు, ఇది నిజం అని కూడా నమ్మారు. ఎన్నికల ముందు గవర్నర్ మార్పు అంటూ, విశ్లేషణలు కూడా మొదలు పెట్టారు.

narasimhan 25012019

అయితే ఈ విషయం పై, నేరుగా కిరణ్ బేడీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా తనను నియమిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఏడాది కాలంగా ఇలాంటి వార్తలు వస్తున్నాయని, అవన్నీ వదంతులేనని గురువారం పేర్కొన్నారు. దీంతో ఇక ఈ వదంతులకు ఫుల్ స్టాప్ పడింది. అయితే గవర్నర్ నరసింహన్ పై మాత్రం, ఏపిలో చాలా మందికి వ్యతిరేకత ఉంది. చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆడుతున్న గేంలో, ఈయన పాత్ర పై కూడా అనేక వార్తలు వచ్చాయి. గవర్నర్ నరసింహన్ పదవీ కాలం ఎప్పుడో ముగిసినప్పటికీ, ఇంకా ఆయన్నే రెండు రాష్ట్రాలకు గవర్నర్ గా కొనసాగించటం పై, తెలుగుదేశం పార్టీ కూడా అభ్యంతరం చెప్తూ వస్తుంది. అయితే ఎన్నికలు అయ్యే వరకు నరసింహన్ కొనసాగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read