రాజకీయ నాయకులు బయటకు చెప్పే దానికి, లోపల చేసే దానికి చాలా తేడా ఉంటుంది. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అసలు ఏమి చెప్తారో, ఏమి చేస్తారో మొత్తం కన్ఫ్యూషన్ గానే ఉంటుంది. ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పలేం. ఈ మధ్య హడావిడి చేసిన దిశ చట్టమే తీసుకుంటే, రాష్ట్రంలో హడావిడి చేస్తున్నారు, కేంద్రానికి మాత్రం సమాచారం ఇవ్వటం లేదు. దీంతో బిల్లు ఆగిపోయింది. ఇక తాజాగా మరో విషయం నిన్న రాజ్యసభ సాక్షిగా బయట పడింది. నిన్న విజయసాయి రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు, వైసీపీ బండారం బయట పడింది. కర్నూలులో నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అయితే ఇదే విషయం పై విజయసాయి రెడ్డి ఒక ప్రశ్న అడిగారు. దీనికి కేంద్ర మంత్రి కిరణ్ రిజీజు సమాధానం ఇచ్చారు. తమకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కర్నూలులో నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ పెట్టమని ఎలాంటి ప్రతిపాదన రాలేదని తేల్చి చెప్పారు. అయితే గతంలో ఇదే విజయసాయి రెడ్డి, తాము కేంద్రాన్ని కర్నూలులో నేషనల్‌ జ్యుడీషియల్‌ అకాడమీ పెట్టమని అడిగినట్టు , మీడియాకు గతంలో చెప్పారు. మరి విజయసాయి రెడ్డి చెప్పింది నిజమా ? లేక తమకు ఎలాంటి ప్రతిపాదన ఏపి నుంచి రాలేదని కేంద్ర మంత్రి చెప్పింది నిజమా ? మరో పక్క కర్నూల్ న్యాయ రాజధాని అంటూ చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, కనీసం ఈ ప్రతిపాదన కూడా కేంద్రానికి ఎందుకు పంపించ లేదు ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read