ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రం మధ్య జల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము పోతిరెడ్డిపాడు నుంచి ఎక్కువ నెలలు తోడేస్తుందని, అలాగే కొత్త ఎత్తిపోతల పధకం విభజన చట్టానికి వ్యతిరేకం అని తెలంగాణా వాపోతుంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్వహణ తమకు ఇచ్చేయాలని ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తెలంగాణాలో కడుతున్న ప్రాజెక్ట్ ల పై అభ్యంతరం చెప్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమం అంటూ వావుపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వచ్చిన జగన్, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అక్రమం అని చెప్పటం పై తెలంగాణ అభ్యంతరం చెప్తుంది. ఇలా అనేక వివాదాల మధ్య, విషయం కేంద్రం వద్దకు చేరింది. రేపు రెండు రాష్ట్రాల మధ్య అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. కేంద్రం జల శక్తి శాఖ మంత్రి ఈ సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ క్రమంలో, తెలంగాణా రాష్ట్రం, కేంద్రాన్ని నిందిస్తూ వ్యాఖ్యలు చేయటం పై అటు కేంద్రం, ఇటు బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు.
ఈ రోజు హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఈ విషయం పై స్పందిస్తూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ "కేసీఆర్, జగన్ ఇద్దరూ కలిసి డిన్నర్ లు చేసుకుంటారు. ఒకరి దావత్ లకు ఒకరు పిలుసుకుంటున్నారు. వాళ్ళ దావత్ కు, వీళ్ళు వెళ్తారు. వీళ్ళ దావత్ కు వాళ్ళు వస్తారు. కానీ ఇద్దరూ కూర్చుని మాత్రం, ఈ విషయం చర్చించరు ఇద్దరు కూర్చుని చర్చలు జరుపుకుంటే, కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయం అందిస్తుంది. కాబట్టి, కేంద్ర ప్రభుత్వానికి నిందించటానికి ఏమి లేదు. తెలంగాణా, మహారాష్ట్ర కలిసి ఒప్పందం చేసుకుంటే, కేంద్రం సహకరించింది కానీ, ఆడ్డు పడలేదు. అలాగే ఈ రోజు కూడా, మీ ఇద్దరూ కలిసి, చర్చించికుని, ఎవరి హక్కుల మేరకు, వాటాల మేరకు, ఒప్పందం కుదుర్చుకుంటే, మేము సిద్ధంగా ఉన్నాం. అపెక్స్ బాడీ మీటింగ్ పెడితే వాయిదా వేయించి, తమని అంటున్నారు. ఇద్దరూ కలిసి ఉంటె, రెండు రాష్ట్రాలకు ఇబ్బందులు లేకుండా కేంద్రం చూస్తుందని" కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి.. జగన్, కేసీఆర్ ల పై చేసిన కామెంట్స్ ఇక్కడ చూడవచ్చు https://youtu.be/FdtmaJYYMSg