ఈవీఎం హ్యాకింగ్‌పై సయ్యద్ సుజా మరో సారి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేత కిషన్‌రెడ్డి బావమరిది కాకిరెడ్డి గెస్ట్‌హౌస్‌లో తమపై కాల్పులు జరిపారని ఆరోపించారు. 2014 మే13 తెల్లవారుజామున 13 మందితో గెస్ట్‌హౌస్‌కు వెళ్లామని సుజా తెలిపారు. అక్కడే ఉన్న కిషన్ రెడ్డి.. మమ్మల్ని చంపేయమంటూ గన్‌మెన్లకు ఆదేశించారని చెప్పారు. వాళ్లు జరిపిన కాల్పుల్లో తమ వాళ్లు 11 మంది చనిపోయారని సయ్యద్ సుజా వెల్లడించారు. మృతుల్లో సమావేశం నిర్వహించిన కమల్‌రావు కూడా ఉన్నారని, తాను తప్పించుకుని అమెరికా వెళ్లిపోయానని సుజా తెలిపారు. ఆ తర్వాత వాటిని మతకలహాల మరణాలుగా మార్చారని, ‌ఉప్పల్ లిటిల్‌ ఫ్లవర్‌ కాలేజి దగ్గర కాకిరెడ్డి గెస్ట్‌హౌస్ ఉందని సయ్యద్‌ సుజా తెలిపారు.

evm 23012019

విన్‌ సొల్యూషన్స్‌ ద్వారా ఈసీఐఎల్‌కు టెక్నికల్ సహకారం అందించామని సయ్యద్‌ సుజా చెప్పారు. విన్‌ సొల్యూషన్స్‌లో దర్యాప్తు చేస్తే అంతా తెలుస్తుందని ఆయన అన్నారు. అమెరికాలో తనను మనీష్‌ సిసోడియా, అర్ణబ్‌ గోస్వామి, వంశీరెడ్డి కలిశారని, ఈసీఐఎల్‌లో పనిచేస్తున్న సమయంలో కూడా వంశీరెడ్డి కలిశారని సుజా చెప్పారు. వీవీప్యాట్‌లో బగ్‌ ఫిట్‌ చేయమని తనను వంశీరెడ్డి అడిగారని తెలిపారు. తర్వాత వంశీరెడ్డిని బస్సు ప్రమాదం పేరుతో చంపేశారని, ఈ నిజాలు వెలికితీస్తారా అంటూ కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. జేఎన్‌టీయూలో తాను ఆర్‌ఎఫ్ ఇంజినీరింగ్ చేశానని, షాదాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజిలో బీటెక్‌ చేశానని సయ్యద్‌ సుజా పేర్కొన్నారు. అయితే ఆయన తన కుటుంబ నేపథ్యం గురించి వివరాలు వెల్లడించలేదు.

evm 23012019

రెండు రోజుల క్రితం, లండన్‌లో జరిగిన ఈవీఎం హ్యాకథాన్‌లో అమెరికా సైబర్ నిపుణులు సయ్యద్ సుజా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని వెల్లడించారు. రిలయెన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ సాయంతో ఫ్రీక్వెన్సీ తగ్గించి ఈవీఎంలను హ్యాక్ చేశారని సుజా ఆరోపించారు. బీజేపీ సీనియర్ నేత గోపీనాథ్ ముండే మరణానికి ఈవీఎంల ట్యాంపరింగ్‌కు లింక్ ఉందని ఆరోపించారు. భారతదేశంలో 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని అమెరికా సైబర్ నిపుణులు సయ్యద్ సుజా ఆరోపించారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ఉత్తర ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్,రాజస్థాన్, చత్తీస్ గడ్, ఢిల్లీ ఫలితాలను రిగ్గింగ్ చేయడం జరిగిందని సుజా తెలిపారు. మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీని విడుదల చేసి మాడ్యులేటర్‌తో ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని లండన్‌లో జరిగిన ఈవీఎం హ్యాకథాన్‌లో సయ్యద్ సుజా తెలిపారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read