నిన్న బొత్సా అమరావతి పై ప్రకటన చేసిన దగ్గర నుంచి, అమరావతి మార్పు వార్తల పై చర్చ జరుగుతుంది. నిన్న విశాఖలో బొత్సా మాట్లాడుతూ, అమరావతి పై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని, త్వరలోనే అమరావతి రాజధాని పై, ఒక ప్రకటన చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అమరావతిలో నిర్మాణాల ఖర్చు ఎక్కువ అవుతుందని, అలాగే వరదల వల్ల ముంపు వస్తుందని, దీని కోసం డ్యాములు, కాలువలు కట్టాలని, ఇదంతా ఖర్చుని పెంచి, ప్రజా ధనం వృధా అయ్యేలా చేస్తుందని, అందుకే రాజధాని పై ఆలోచన చేస్తున్నామని, త్వరలో నిర్ణయం చెప్తామని బొత్సా అన్నారు. అయితే, ఈ విషయం పై రాజధాని రైతుల్లో ఆందోళన నెలకొంది. చంద్రబాబు వరల్డ్ క్లాస్ రాజధాని కడతారని భూములు ఇచ్చామని, ఆయన ఇప్పటికే పనులు మొదలు పెట్టారని, వీళ్ళు వచ్చి, ఇప్పుడు ఇలా చెప్తున్నారని ఆందోళన చెందుతున్నారు.

amaravati 21082019 2

దీని పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. అమరావతి కోసం ఖర్చు అవుతుందని ఆపేస్తాం అంటున్నారని, కాని అమరావతి కోసం, వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదని అన్నారు. 33 వేల ఎకరాల్లో అన్ని మౌలిక వసతులు ఇచ్చిన తరువాత, 8 వేల ఎకరాలు ప్రభుత్వనైకివ్ వస్తాయని, అవి అమ్ముకుంటే పైసా ఖర్చు లేకుండా, ప్రభుత్వం అమరావతి నిర్మాణం చెయ్యొచ్చని అన్నారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి పై అపోహలు ఉన్న వేళ, బొత్సా ఈ వ్యాఖ్యలు చెయ్యటంతో, రాజధానిని తరలించతం ఖాయం ఏమో అని, ప్రజలు అనుకుంటున్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. హైదరాబాద్ లో, కిషన్ రెడ్డిని, మీడియా ప్రతినిధులు, అమరావతి తరలింపు పై, కిషన్ రెడ్డిని అడిగారు.

amaravati 21082019 3

ఇలాంటి అంశాలు అన్నీ కేంద్ర హోమ శాఖ పరిధిలోకి వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చే విషయం పై, కేంద్రం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేసారు. అమరావతి పై మేము, ఏమి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర రాజధాని మార్పు అంశం పై, మా పరిధిలోకి రాదని అన్నరు. అలాగే హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని అంటూ వస్తున్న వార్తల పై ప్రశ్నించగా, హైదరాబాద్ ను రెండో రాజధాని చేసే ఆలోచన కేంద్రానికి లేదని కిషన్ రెడ్డి అన్నారు. మొత్తానికి, అటు అమరావతి, హైదరాబాద్ పై , కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అయితే కేంద్రం చెప్పినా, వినని వ్యక్తి జగన్. చూద్దాం ఏమి చేస్తారో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read