క-రో-నా తాకిడికి, రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది. జీవితాలు తారుమారు అయిపోతున్నాయి. ఈ రోజు బాగా ఉన్న మనిషి, రేపటికి చనిపోతున్నారు. ఆక్సిజన్ బెడ్లు ఎక్కడా దొరకటం లేదు. ఎమర్జెన్సీ పరిస్థితిలో పేషెంట్ ఉంటే, బెడ్ దొరకటం అనేది దాదాపు అసంభవం అయిపొయింది. ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తుంది. బెడ్లు పెంచటం, కొత్త సెంటర్స్ ఏర్పాటు చేయటం, కళ్యాణమండపాలు, కాలేజీలు, కోవిడ్ సెంటర్స్ గా మార్చి, వైద్యులను అందుబాటులో పెట్టి, ప్రజల ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. పాక్షిక లాక్ డౌన్ పెట్టి, చేతులు దులుపు కున్నాయి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా, విమర్శ చేస్తుంటే ప్రభుత్వం తట్టుకోలేక పోతుంది. జాగ్రత్తగా ఉండండి అని సమాచారం ఇస్తే, చంద్రబాబు లాంటి వారి పై కూడా కేసులు పెడుతున్నారు. ఇంత గందరగోళంలో ఇప్పుడు ఉన్న ఒకే ఒక ఆప్షన్, టీకా. మిగతా రాష్ట్రాలు పెద్ద ఎత్తున సొంతగా టీకా ఆర్డర్ ఇచ్చాయి. కొన్ని చోట్ల 18 ఏళ్ళు దాటిన వారికి కూడా టీకా అందుబాటులో ఉంది. కేంద్రం కూడా, రాష్ట్రాలను సొంతగా టీకా కొనటానికి అనుమతి ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, కేవలం 13 లక్షల టీకాలు ఆర్డర్ ఇచ్చింది. ఈ వార్త తెలిసి అందరూ ఆశ్చర్య పోయారు. వేస్టేజ్ అంతా లెక్కలో నుంచి తీసి వేస్తే, ఈ ఆర్డర్ కనీసం 5 లక్షల మంది వరుకే సరిపోతుంది. మరి, మిగతా వారికి ? ఇప్పటికే మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకుని, రెండో డోస్ పడక ప్రజలు అల్లాడుతున్నారు.
కేవలం కేంద్రం పంపించే వ్యాక్సిన్ లతో, నెట్టుకుని వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సొంతగా వ్యాక్సిన్ లు కొనటం లేదు, అందరికీ వ్యాక్సిన్ లు ఇవ్వాలని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజలు కూడా ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా, కేంద్రం అనుమతి ఇవ్వలేదని, నిన్నటి దాకా వైసీపీ నేతలు బుకాయించారు. ఈ రోజు బయటకు వచ్చిన కొడాలి నాని, మేము మీకు 1600 కోట్లు ఇస్తాం, ఎవరి ఎకౌంటు లో వేయాలో చెప్పండి వేస్తాం, మీరు వ్యాక్సిన్ లు తెచ్చి పెట్టండి అంటూ, తెలుగుదేశం నేతలకు కౌంటర్ ఇచ్చారు. మిగతా రాష్ట్రాలు ఎలా తెచ్చుకుంటున్నాయి అనేది చూడకుండా, మీరు తీసుకురండి అని ప్రతిపక్షాలను, ఒక రాష్ట్ర ప్రభుత్వం కోరటం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఇవన్నీ చూస్తుంటే, మొన్న వైసీపీ ఎంపీలు చెప్పినట్టు, చేతులు ఎత్తేసారా ? ఈ రోజు కొడాలి నాని కూడా అదే చెప్తున్నారా ? ప్రతిపక్షాలు చేస్తే, ఇక ప్రభుత్వం ఎందుకు ? దిగి పోవచ్చు కదా ? ఇప్పటికినా ఇలాంటి ఎదురు దాడి కాకుండా, పక్క రాష్ట్రాలు ఎలా వ్యాక్సిన్ లు తెచ్చుకున్నాయి చూసి, మనం కూడా అదే పని చేస్తే, ప్రజలు హర్షిస్తారు.