వివిధ రాజకీయ పార్టీల్లో ఏమన్నా సమస్య వస్తే, అధినేత స్పందించటం కాని, లేకపోతే సీనియర్ నేతలతో చర్చలు జరపటం కాని చేసి, సమస్యను పరిష్కరిస్తారు. మన ప్రతిపక్ష నేత జగన్ పార్టీలో మాత్రం అందుకు భిన్నం. అధినేత జగన్ కేమో ఇగో. అసలు తగ్గే సమస్యే ఉండదు. ఇక ఆ పార్టీలో సీనియర్ అనే వాడు ఉండడు. ఉన్నా, విజయసాయి రెడ్డి లాంటి మహా ఘనులు ఉంటారు. అలాంటి వాడి మాటలు కోర్ట్ లోనే వినరు, ఇంకా పార్టీలో ఎవరు ఉంటారు. అందుకే మన జగన్ బాబు, వెరైటీగా అలోచించి, విజయవాడ గొడవ సైలెంట్ చెయ్యటానికి, కొడాలి నానిని రంగంలోకి దించాడు.
ఇక్కడ ఇంకో వెరైటీ ఏంటి అంటే, ఈ కొడాలి నానికి టిడిపిలోకి ఎంట్రీ లేక, జగన్ దగ్గర ఉండిపోవాల్సిన పరిస్థితి. ఇతనికే ఈ సారి గెలిచే దికానం లేదు అనే టాక్ నడుస్తుంటే, ఇతను వచ్చి, మరొకరికి అభయం ఇస్తున్నాడు అంటే, ఆ పార్టీ ఏంటో, ఆ అధినేత ఏంటో, ఈ మధ్యవర్తులు ఏంటో... అందుకు కాదు వంగవీటి రాధా అలిగింది... ఇక విషయానికి వస్తే, విజయవాడ నగర వైసీపీలో నిన్న జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. సెంట్రల్ నియోజకవర్గం సీటు, ముందుగా రాధాకు ఇస్తా అని మాటిచ్చి, ఇప్పుడు మల్లాది విష్ణుకు సీట్ ఇవ్వటంతో, జగన్ వైఖరి పై వంగవీటి రాధా వర్గం భగ్గు మంది. నిన్న విజయవాడలో జగన్ కి వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేసింది ఈ వర్గం.
ఆందోళనలో భాగంగా బందరురోడ్డులోని రంగా విగ్రహం ఎదుట బైఠాయించారు. రాధా అభిమానులు ఇద్దరు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అదే సమయానికి రాధా రావడంతో రెచ్చిపోయిన అభిమానులు రంగా కుటుంబం కోసం, రాధా కోసం ప్రాణాలిస్తామంటూ నినదించారు. పెట్రోలు పోసుకున్న వారిపై రాధా నీళ్లు చల్లి సముదాయించారు. అయితే, రాధాను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం గుడివాడ ఎమ్మెల్యే నాని రంగంలోకి దింపింది. వీరు రాధా కార్యాలయానికి చేరుకుని చాలాసేపు ఆయనతో మంతనాలు జరిపారు. కొడాలి నాని, రాధకు అభయం ఇచ్చారని, బందర్ ఎంపీగా పోటీ చెయ్యి,నిన్ను నేను గెలిపిస్తా అని రాధాకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే రాధా మాత్రం, ససేమీరా అంటున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి, కొడాలి నాని లాంటి వాడిని, జగన్ ఇలా వాడాడు అంటే గ్రేట్ కదా...