ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ పాత్ర చాల వరకు పరిమితం. ఏపిలో బీజేపీ నేతలు చాలా వరకు వైసిపీతో కలిసిపోయారు అనే అభిప్రాయం అందరిలో ఉంది. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జీవీఎల్ పై మొదటి నుంచి ఈ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ వీరు టిడిపిని, చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు బీజేపీ నేతలు, వైసీపీ పై చేసిన ఆరోపణలు చర్చనీయాంసం అయ్యాయి. తమ సహజ శైలికి భిన్నంగా వీరు వైసీపీని టార్గెట్ చేయటమే కాకుండా, వారిపై సంచలన ఆరోపణలు కూడా చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలో ఒకటి రైతులకు ధాన్యం బకాయలు చెల్లించక పోవటం. గతంలో చంద్రబాబు హాయాంలో 21 రోజుల్లో ధాన్యం బకాయలు ఇచ్చే వారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి హాయాంలో, నాలుగు నెలలు అవుతున్నా ఇంకా రైతులకు ధాన్యం డబ్బులు రాలేదు. ఇప్పటికే టిడిపి దీని పై పోరాటం చేస్తుంది. ఈ అంశం పై బీజేపీ కూడా స్పందించింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ళలో పెద్ద కుంభకోణం జరిగింది అంటూ సోము వీర్రాజు ఆరోపణలు చేసారు. మిల్లర్లతో కలిసి వైసీపీ ప్రజా ప్రతినిధులు, అధికారులు దోచుకుని, రైతులను నిలువునా ముంచారని అన్నారు. పంట కొనుగోళ్ళ బకాయలు ఇప్పటికీ ఇవ్వకపోవటం పై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రాహం వ్యక్తం చేసారు.

kodali 19072021 2

అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన ఆరోపణ సంచలనం అయ్యింది. ఒక జిల్లా స్థాయి, డీఎం స్థాయి అధికారి, రూ.3కోట్లతో ఒక వైసీపీ మంత్రికి ఇల్లు కట్టించి ఇచ్చారు అని, దీంట్లో ఎంత తినేసారో చెప్పటానికి ఇదే ఉదాహరణ అని అన్నారు. అయితే ఆ మంత్రి పేరు చెప్పలేదు. సహజంగా ఆ శాఖ పౌరసరఫరాల శాఖ కాబట్టి, కొడాలి నానిని టార్గెట్ చేసారనే చెప్పాలి. దీనికి తగ్గట్టుగానే, కొడాలి నాని ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి, ఈ అంశం పై స్పందిస్తూ, సోము వీర్రాజు పై ఫైర్ అయ్యారు. ఆ మంత్రి ఎవరో, ఆ అధికారి ఎవరో చెప్పాలని, సోము వీర్రాజున డిమాండ్ చేసారు. పౌరసరఫరాల శాఖ, కేంద్రంతో కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి, కేంద్రంలో అధికారం మీదే కాబట్టి, సిబిఐ ఎంక్వయిరీ వేసుకోండి అంటూ కొడాలి నాని డిమాండ్ చేసారు. నోటాతో పోటీ పడే పార్టీ అంటూ, కొడాలి నాని ఫైర్ అయ్యారు. అయితే సిబిఐ ఎంక్వయిరీ వేయాలి అంటే, రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలి, మరి జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసి, కొడాలి నాని సిబిఐ ఎంక్వయిరీ వేయమని అడుగుతారో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read