మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలతో వైసీపీ ఇరుకున పడింది. వివేకానందరెడ్డి హ-త్యకేసులో ఇప్పటికే సీబీఐ జగన్ రెడ్డి ఓఎస్డీ, భారతి పీఏలను విచారించింది. దీంతో అందరి చూపు తాడేపల్లి ప్యాలెస్ పై పడింది. ఇదే సందర్భంగా టిడిపి జగనాసుర రక్తచరిత్ర అంటూ వివేకా హ-త్యకేసులో జగన్ రెడ్డి పాత్రపై అనుమానాలు, ఆధారాలతో ఓ పుస్తకం వేసింది. దీనిపై స్పందిస్తూ, కౌంటర్ ఎటాక్ చేయాలనుకున్న మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీని పూర్తిగా బుక్ చేసేలా వ్యాఖ్యలు చేశారు. జగన్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినా వివేకా కాంగ్రెస్ లోనే ఉండి వైఎస్ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో పోటీచేసిన వైఎస్ విజయమ్మను ఓడించేందుకు వివేకానందరెడ్డి పనిచేశారని ప్రకటించారు. అంటే వైఎస్ వివేకానందరెడ్డికి జగన్ రెడ్డి కుటుంబానికి విభేదాలున్నాయని తన మాటల ద్వారా చెప్పకనే చెప్పారు. వివేకా చనిపోతే జగన్ కు ఆస్తి వచ్చిందా? అని ప్రశ్నించారు. వివేకా భార్య, కూతురు, అల్లుడి పేర్లపైనే ఆస్తులు బదిలీ అయ్యాయని చెప్పడం ద్వారా వివేకానందరెడ్డిని చంపింది ఆయన కూతురు, అల్లుడు, భార్యేననే అర్థం వచ్చేలా కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు జగన్ రెడ్డిని ఈ హ-త్యకేసులో ఇరికించేలా ఉన్నాయని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. వివేకానందరెడ్డి బతికున్నా ఆ సీటును అవినాష్ రెడ్డికే జగన్ ఇచ్చేవారని చెప్పడంతో వివేకానందరెడ్డి కడప ఎంపీ సీటు అవినాశ్ రెడ్డికి ఇవ్వొద్దనే అంశమే ఈ హ-త్యలో కీలక ఆధారమని కొడాలి మాటలు వెల్లడిస్తున్నాయి. కడప ఎంపీ సీటు విషయంలో వివేకానందరెడ్డి తనకైనా, షర్మిలకైనా సీటు ఇవ్వాలని కోరడంతోనే ఆయనను చంపేశారనే ఆరోపణలకు కొడాలి నాని బలం చేకూర్చినట్టయ్యింది.
బాబాయ్ హ-త్య కేసులో నోరుజారిన కొడాలి నాని.. సిబిఐ పిలుపు తప్పదా ?
Advertisements