ఒక పక్క జగన్ నేనే సియం అంటూ, వీధి వీధి తిరుగుతున్నారు... జగన్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో కాని, మంత్రి పదవులకి మాత్రం గిరాకీ బాగా పెరిగింది.... ఇప్పటి నుంచి, అడ్వాన్సు బుకింగ్స్ జరుగుతున్నాయి... మొన్నటికి మొన్న రోజా, జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే, తాను హోం మంత్రి అవుతాను అని ప్రకటించింది... చెవిరెడ్డి, బొత్సా, వాసిరెడ్డి పద్మ, అంబటి రాంబాబు లాంటి నేతలు, ఇప్పటికే జగన్, విజయసాయి దగ్గర, ఏ మంత్రి పదవులు కావాలో చెప్పి ఉంచారు.. అయితే దీనికి భిన్నంగా ప్రకటన చేసారు, గుడివాడ ఎమ్మల్యే కొడాలి నాని... జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే, నాకు మంత్రి పదవి వద్దు అంటూ, వేరే కోరిక కోరారు...
2019 ఎలక్షన్స్ లో, 137 సీట్లు వస్తాయిని జగన్ ప్రకటించారు... తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ కూడా రావు అని చెప్పారు... విషయం ఆరా తీస్తే, ప్రశాంత్ కిషోర్ సర్వేలో, ఇలా వచ్చింది అని తేలినట్టు లోటస్ పాండ్ వర్గాలు చెప్పటంతో, జగన్ పార్టీ ఎమ్మల్యేలు అందరూ కూడా అది నిజమే అని నమ్ముతున్నారు... అందుకే 2019లో మంత్రి పదవులు ఎవరికి కావలి, కాంట్రాక్టులు ఎవరకి కావలి, ఇలా లిస్టు తాయారు చేసుకుంటున్నారు... అయితే నంద్యాల, కాకినాడ రిజల్ట్ చూసినాక కూడా, జగన్ కాన్ఫిడెన్సు ఏంటో, వైసీపీ శ్రేణులుకు అర్ధం కావటం లేదు...
ప్రశాంత్ కిషోర్ మూడో విడత పేమెంట్ కోసం, ఎదో పిచ్చి సర్వేలు జగన్ ముందు ఉంచి, ఇదే నిజం అని నమ్మించి, జగన్ తో పాటు, జగన్ ఎమ్మల్యేలను కూడా చిటారు కొమ్మన ఎక్కిస్తున్నారని, వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి... అయితే గుడివాడ ఎమ్మల్యే కొడాలి నాని మాత్రం, జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వగానే నాకు మంత్రి పడవు వద్దు అంటూ వింత కోరిక కోరారు... జగన్ అన్న గుండెల్లో ఇంత స్థానం ఉంటే చాలు అని, అది మంత్రి పదవి కంటే ఎక్కువ అని అంటున్నారు... జగన్ మాటలు, ప్రశాంత్ కిషోర్ సర్వే, కొడాలి నాని మాటలు వింటున్న జనం మాత్రం, పగలబడి నవ్వుతున్నారు...