ప్రజాస్వామ్యంలో, ప్రజలే నిర్ణేతలు. ఎప్పుడు ఎత్తుతారో, ఎప్పుడు పడేస్తారో తెలియదు. ప్రతిక్షణం వారికి సేవ చేస్తూనే ఉండాలి. వారి మన్ననలు పొందుతూనే ఉండాలి. మనలో ఎంత గర్వం ఉన్నా, ఎంత అహంకారం ఉన్నా, అది బయట పడిన రోజు, ఏమి మిగలదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మహా మహులు అయిన ఇందిరా గాంధీ, అన్న ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పలేదు. రెండు సీట్లు ఉన్న బీజేపీ, ఇప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాల్లో పాగా వేస్తుంది అంటే, ప్రజాస్వామ్యం గొప్పదనం. ఎంత తొందరగా పైకి ఎగబాకుతారో, అహంకారం తలకు ఎక్కితే అంతే తొందరగా కింద పడిన సందర్భాలు ఎన్నో. అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేయటానికి కానీ, ప్రతిపక్షాల పై కక్ష తీర్చుకోవటానికి కాదు. రాజకీయం అనేది, ఏదైనా ఒక లిమిట్ వరకు ప్రజలు ఒప్పుకుంటారు కానీ, శ్రుతిమించితే కత్తిరిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షానికి, అహంకారం అనేది తారా స్థాయిలో ఉంది. 151 సీట్లు ఉన్నాయి, మాకేంటి అనే ధీమాలో ఉన్నారు. ప్రజలకు వివిధ సంక్షేమ పధకాలతో ఆకట్టుకుంటున్నాం, మాకేంటి అనే ధీమాలో ఉన్నారు. కానీ గత ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువే సంక్షేమం చేసింది, కానీ ఎందుకు ఓడిపోయింది. ప్రస్తుత అధికార పక్షం ఇది గుర్తిస్తున్నట్టు లేదు. నిన్న గుడివాడలో, జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలై మూడేళ్ళు అయిన సందర్భంగా ర్యాలీ చేసారు.

kodali 10112020 2

ఇందులో మంత్రి కొడాలి నాని పల్గుని, తెలుగుదేశం పార్టీ పై ఘాటు వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం నాయకులు నా ఇల్లు నా సొంతం అంటూ రోడ్డు ఎక్కి షో చేస్తున్నారని, ఇళ్ళ పట్టాలను కోర్టుకు వెళ్లి చంద్రబాబు ఆపారని, జగన్నాధ రధ చక్రాల కింద, తెలుగుదేశం పార్టీని నల్లిని నలిపినట్టు నలిపెస్తాం అంటూ, ఎంతో అహంకారంగా మాట్లాడారు. అయితే తెలుగుదేశం వాళ్ళు నచ్చకపోతే, ప్రజలే నలిపెస్తారు. ఇక్కడ జగన్ నలిపేది ఏమి ఉండదు. ప్రజలు తలుచుకుంటే, ఎవరిని అయినా నలిపేస్తారు. అహంకారం ఉన్న వాళ్ళని, ప్రజాస్వామ్యంలో ప్రజలు అసలు హర్షించారు. గత రెండు రోజులుగా అమెరికా నుంచి, నేటి దుబ్బాక దాకా ప్రజలు చెప్పింది అదే. 2008 నుంచి, ఉప ఎన్నికల్లో ఓటమి ఎరుగని టీఆర్ఎస్, నేడు ఎందుకు ఓడిపోయింది ? గెలుస్తానని ధీమాగా చెప్పిన ట్రంప్ ఎందుకు ఓడిపోయారు ? వీళ్ళు కూడా ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన వారే. కానీ వీరి ఓటమికి అహంకారం, నిర్లక్ష్యపు వైఖరి అనేవి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెప్తున్నారు. రాజకీయం అంటే బూతులు తిట్టటం, అహంకారం ప్రదర్శించటం కాదు. ఒకరికి మించి మరొకరు ప్రజలకు సేవ చేసి, వారి అభిమానాన్ని పొందటం. ఇవి కాకుండా అహంకారంతో ముందుకు పొతే, ప్రజలే చూసుకుంటారు. కొంచెం లేట్ అవ్వొచ్చు ఏమో కానీ, ప్రజాస్వామ్యం తప్పకుండ వర్ధిల్లుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read