ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 25 మంత్రుల జాబితాను కొద్ది సేపటి క్రితం ప్రకటించారు. అయితే ఈ కొత్త మంత్రుల జాబితాలో ఎన్నో వింతలు ఉన్నాయి. పలు వర్గాలకు క్యాబినెట్ లో చోటు లేదు. కమ్మ, వైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ వర్గాలకు ఒక్కటంటే ఒక్క పదవి కూడా లేదు. ఇక ప్రకాశం జిల్లాలో ఏ ఒక్కరికి మంత్రి పదవి దక్క లేదు. ఇక కొడాలి నానిని మంత్రి పదవి పీక్ కొత్త పదవి ఇచ్చారు. త్వరలో ఏపీ స్టేట్ డెవలప్‍మెంట్ బోర్డు ఏర్పాటు అవుతుందని, దానికి ఛైర్మన్‍గా కొడాలి నానికి అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కొడాలి నానికి కేబినెట్ హోదాలో రాష్ట్ర అభివృద్ధి బోర్డు ఛైర్మన్ బాధ్యతలు ఇస్తారాని చెప్తున్నారు. ఇక చీఫ్‍విప్‍గా ప్రసాదరాజు, డిప్యూటీ స్పీకర్‍గా కోలగట్ల వీరభద్రస్వామి, ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్‍గా మల్లాది విష్ణులను నియమించారు. ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గ జాబితా - 25 మందితో కొత్త మంత్రివర్గ కూర్పు ఇదే, 1.ధర్మాన ప్రసాదరావు(శ్రీకాకుళం) - కొప్పల వెలమ 2.సీదిరి అప్పలరాజు(పలాస) - మత్స్యకార 3.బొత్స సత్యనారాయణ(చీపురుపల్లి) - కాపు 4.పీడిక రాజన్నదొర(సాలూరు)5.గుడివాడ అమర్నాథ్(అనకాపల్లి)- కాపు 6.బూడి ముత్యాలనాయుడు(మాడుగుల)- కొప్పల వెలమ 7.దాడిశెట్టి రాజా(తుని) - కాపు 8.పినిపే విశ్వరూప్(అమలాపురం) - ఎస్సీ
9.కారుమూరి వెంకట నాగేశ్వరావు(తణుకు) - శెట్టి బలిజ 10.తానేటి వనిత(కొవ్వూరు) - ఎస్సీ 11.కొట్టు సత్యనారాయణ(తాడేపల్లిగుడెం) - కాపు 12.జోగి రమేష్(పెడన) - గౌడ 13.అంబటి రాంబాబు(సత్తెనపల్లి) - కాపు 14.మేరుగ నాగార్జున(వేమూరు) 15.విడుదల రజిని(చిలకలూరిపేట) 16.కాకాణిగోవర్ధన్ రెడ్డి(సర్వేపల్లి) - రెడ్డి 17.అంజాద్ బాషా(కడప) - మైనారిటీ 18.బుగ్గనరాజేంద్రనాథ్రెకడ్డి(డోన్) - రెడ్డి 19.గుమ్మనూరు జయరాం(ఆలూరు) - బోయ 20.పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి(పుంగనూరు) - రెడ్డి 21.నారాయణస్వామి(గంగాధరనెల్లూరు) 22.ఆర్కే రోజా(నగిరి) - రెడ్డి 23.ఉషా శ్రీ చరణ్(కళ్యాణదుర్గం) 24.చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ(రామచంద్రాపురం) 25.తిప్పేస్వామి(మడకశిర) - ఎస్సీ